Home Actor మ‌రో వివాద‌స్ప‌ద చిత్రం ప్ర‌క‌టించిన సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు వ‌ర్మ.!

మ‌రో వివాద‌స్ప‌ద చిత్రం ప్ర‌క‌టించిన సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు వ‌ర్మ.!

159
0


సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ తెర‌కెక్కించిన తాజా చిత్రం ల‌క్ష్మీస్ ఎన్టీఆర్. వివాద‌స్ప‌మైన ఈ సంచ‌ల‌న చిత్రం ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో త‌ప్పా..మిగిలిన అన్ని ఏరియాల్లో రిలీజై స‌క్స‌స్ ఫుల్ గా ర‌న్ అవుతోంది. ఓవ‌ర్ సీస్ లో సైతం రికార్డు స్ధాయి క‌లెక్ష‌న్స్ వ‌సూలు చేస్తుండ‌డం విశేషం. సుప్రీం కోర్ట్ వ‌ర‌కు వెళ్లైనా స‌రే…న్యాయం కోసం పోరాటం చేసి ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో కూడా ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రాన్ని రిలీజ్ చేస్తాన‌ని వ‌ర్మ ప్ర‌క‌టించారు.

ఇదిలా ఉంటే..మ‌రో వివాదస్ప‌ద చిత్రం చేయ‌నున్న‌ట్టు  వ‌ర్మ ట్విట్ట‌ర్ ద్వారా ఎనౌన్స్ చేసారు. ఇంత‌కీ ఆ చిత్రం ఏంటంటారా..?  జ‌య‌ల‌లిత,  శశికళల అనుబంధం, మనసంటూ లేని కఠినాత్ములు, జైళ్లు , మన్నార్‌గుడి గ్యాంగ్స్ కు వ్యతిరేకంగా అల్లుకున్న కథ అంటూ వర్మ ఓ పోస్టర్‌ను విడుదల చేశారు. జ‌య‌ల‌లిత జీవితం ఆధారంగా లేడీ డైరెక్టర్ ప్రియదర్శిని దర్శకత్వంలో ది ఐరన్ లేడీ, అలాగే డైరెక్ట‌ర్ ఎ.ఎల్. విజ‌య్  తలైవి అనే చిత్రాలు తెర‌కెక్కిస్తున్నారు. ఈ నేప‌ధ్యంలో జ‌య‌ల‌లిత‌, శశిక‌ళ బంధం పై సినిమాను వ‌ర్మ తెర‌కెక్కిస్తాన‌ని ప్ర‌క‌టించ‌డం విశేషం. మ‌రి…ఈ సినిమాతో ఎలాంటి సెన్సేష‌న్ క్రియేట్ చేస్తారో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here