Home Political News మ‌ల్కాజ్ గిరిలో అమిత్ షా రోడ్ షో..!

మ‌ల్కాజ్ గిరిలో అమిత్ షా రోడ్ షో..!

95
0

తెలంగాణ‌లో బీజేపీ ఎన్నిక‌ల ప్ర‌చారంలో జోరు పెంచింది. మ‌ల్కాజ్ గిరి నియోజ‌క‌వ‌ర్గం నుంచి బీజేపీ అభ్య‌ర్ధిగా పోటీ చేస్తోన్న ఎన్.రామ‌చంద్రరావుకు మ‌ద్ద‌తుగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ప్ర‌చారం చేసారు.  మల్కాజిగిరి నియోజికవర్గంలోని ఓల్డ్ సఫీల్ గూడా  నుండి కృపా కాంప్లెక్స్ వరకు  అమిత్ షా రోడ్ షో లో పాల్గొన్నారు. ఆయ‌న‌తో పాటు బీజేపీ అభ్య‌ర్ధి ఎన్.రామ‌చంద్రరావు, స్ధానిక నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు పాల్గొన్నారు.

ఈ సంద‌ర్భంగా బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు అమిత్ షా మాట్లాడుతూ…నాలుగున్నరేళ్ల టీఆర్ఎస్ పాలన పై ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని, ప్రజలకిచ్చిన హామీలను అమలు చేయడంలో కేసీఆర్ విఫలమయ్యారని అన్నారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పేరుతో ప్రజలను మోసం చేశారని, కేంద్రం ఆవాస్ పథకం కింద ఇచ్చిన నిధులను కేసీఆర్ పక్కదోవ పట్టించారని విమ‌ర్శించారు. ఆయుష్మాన్ భారత్ ను తెలంగాణలో అమలు చేయడం లేదని అన్నారు.

తెలంగాణ అమరవీరుల కుటుంబాలను కేసీఆర్ పట్టించుకోలేదని విమర్శించారు. మజ్లిస్ పార్టీ కాళ్ల వద్ద తెలంగాణ స్వాభిమానాన్ని తాకట్టుపెట్టారని, ఆ పార్టీకి భయపడి తెలంగాణ విమోచన దినోత్సవం జరపడం లేదని  కేసీఆర్ పై విరుచుకుపడ్డారు. తాము అధికారంలోకి వ‌స్తే సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవం జరుపుతామ‌న్నారు. మ‌తపరమైన రిజర్వేషన్లు రాజ్యాంగ వ్యతిరేకమని… తెలంగాణ అభివృద్ధి చెందాలంటే బీజేపీ అభ్య‌ర్ధుల‌ను గెలిపించాలి అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here