Home Actor మ‌ల్లేశం టీమ్ కి ద‌ర్శ‌కేంద్రుడి ప్ర‌శంస‌లు.!

మ‌ల్లేశం టీమ్ కి ద‌ర్శ‌కేంద్రుడి ప్ర‌శంస‌లు.!

97
0
మ‌ల్లేశం టీమ్ కి ద‌ర్శ‌కేంద్రుడి ప్ర‌శంస‌లు.! spiceandhra

ప‌ద్మ శ్రీ చింత‌కింది మ‌ల్లేశం జీవితం ఆధారంగా తెర‌కెక్కిన సినిమా `మ‌ల్లేశం`. అగ్గిపెట్టెలో ప‌ట్టేంత చిన్న చీర‌ల‌ను కూడా నేచి ప్రపంచాన్ని అబ్బుర పరిచిన వ్యక్తి మల్లేశం. తను సాధించిన విజయాలతో చేనేత ప్రాముఖ్యతను దేశ వ్యాప్తంగా చాటి చెప్పిన ఘ‌న‌త మ‌ల్లేశం సొంతం. ఇలాంటి గొప్ప వ్యక్తి జీవితం ఆధారంగా `మ‌ల్లేశం` సినిమా తెర‌కెక్కింది.

రాజ్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేశారు. శ్రీ అధికారి, రాజ్.ఆర్ నిర్మించారు. ఇందులో మ‌ల్లేశం పాత్ర‌లో ప్రియ‌ద‌ర్శి నటించారు. అన‌న్య‌, ఝాన్సీ, చక్ర‌పాణి కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. ఇటీవ‌ల ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన మ‌ల్లేశం మంచి సినిమాగా ప్రేక్ష‌కాద‌ర‌ణ పొందుతోంది.

ఈ సినిమాని చూసిన ద‌ర్శ‌కేంద్రుడు రాఘ‌వేంద్ర‌రావు ఫేస్ బుక్ ద్వారా స్పందిస్తూ…మల్లేశం సినిమా చూశాను. ఒక ప్రయోజనం ఉన్న సినిమా. చేనేత కార్మికురాలిగా తన తల్లి పడుతున్న ఆవేదనను చూసి, పెద్దగా చదువుకోకపోయినా ఆసు యంత్రాన్ని కనుక్కొని, ఆ కార్మికుల కష్టాలను కొంత మేర తగ్గించి, తన ప్రయత్నానికి గుర్తింపుగా పద్మశ్రీ పురస్కారాన్ని అందుకున్న చింతకింది మల్లేశం అభినందనీయుడు.

 ఆ కృషిలో భాగంగా, నా వంతు సాయంగా నాలుగు ఆసు యంత్రాల కొనుగోలు నిమిత్తం లక్షరూపాయల విరాళాన్ని ఇవ్వాలని నిర్ణయించుకున్నాను. ప్రియదర్శి, అనన్య, ఝాన్సీ ఇతర నటీనటులందరూ వారి వారి పాత్రలకు న్యాయం చేశారు. దర్శకుడు రాజ్ కు అభినందనలు. మంచి ప్రయత్నం చేసిన మల్లేశం టీమ్ సభ్యులందరికీ శుభాకాంక్షలు అని తెలియచేసారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here