Home Political News మ‌హాకూట‌మిలో ట్విస్ట్ – 100 స్ధానాల్లో కాంగ్రెస్ పోటీ..!

మ‌హాకూట‌మిలో ట్విస్ట్ – 100 స్ధానాల్లో కాంగ్రెస్ పోటీ..!

92
0

టీఆర్ఎస్ ని ఓడించ‌డ‌మే ల‌క్ష్యంగా ఏర్పడిన మ‌హాకూట‌మి సీట్ల స‌ర్ధుబాటు రోజుకో మ‌లుపు తిరుగుతోంది. ఈ కూట‌మిలో ఉన్న కాంగ్రెస్ పార్టీ 94 స్ధానాల్లో పోటీ చేసి మిగతా సీట్లను తెలుగుదేశం, టీజేఎస్, సీపీఐ పార్టీలకు ఇస్తామని చెప్పింది. అయితే… కాంగ్రెస్ పార్టీ  అనూహ్యంగా 100 స్థానాలకు బీఫామ్ లు ఇచ్చింది. ఈరోజు ఉదయం ఉత్తమ్ కుమార్ రెడ్డి మరో ఆరు స్థానాల్లో అభ్యర్థులను బరిలోకి దించుతూ వారికి బీఫామ్ లు ఇచ్చారు.

హుజూరాబాద్ లో కౌశిక్ రెడ్డికి, దుబ్బాకలో మద్దుల నాగేశ్వర్ కు, పటాన్ చెరులో కాట శ్రీనివాస్ కు ఉత్తమ్ బీఫామ్ లు ఇచ్చారు. టీడీపీకి కేటాయించిన ఇబ్రహీంపట్నం సీటులో ఆ పార్టీ సామ రంగారెడ్డికి బీఫామ్ ఇచ్చారు. అయితే… నేడు ఉత్తమ్ కుమార్ రెడ్డి మల్ రెడ్డి రంగారెడ్డికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీంతో ఈ స్థానంలో అయోమయం నెలకొంది. వరంగల్ తూర్పు, మహబూబ్ నగర్, మిర్యాలగూడల్లో మహాకూటమి పార్టీల మధ్య స్నేహపూర్వక పోటీ ఉంటుందని కాంగెస్ వర్గాలు అంటున్నాయి. మ‌రి..టీటీడీపీ ఎలా స్పందిస్తుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here