Home Political News మ‌హాకూట‌మి అధికారంలోకి వ‌స్తే..నెల‌కొక‌రు సీఎంగా ఉంటారు – తెలంగాణ మంత్రి కేటీఆర్

మ‌హాకూట‌మి అధికారంలోకి వ‌స్తే..నెల‌కొక‌రు సీఎంగా ఉంటారు – తెలంగాణ మంత్రి కేటీఆర్

97
0

ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ ఇబ్ర‌హీంప‌ట్నంలో టీఆర్ఎస్ కార్య‌క‌ర్త‌ల‌తో ప్రత్యేక స‌మావేశం ఏర్పాటు చేసారు. ఈ స‌మావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ..పాల‌మూరు పై ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు అన్నీ అబ‌ద్దాలే చెప్పార‌న్నారు. ఇబ్ర‌హీంప‌ట్నంలో ప్ర‌పంచంలోనే అతి పెద్ద ఫార్మాసిటీ నిర్మించ‌బోతున్నాం అని తెలియ‌చేసారు.  మ‌హాకూట‌మి జుట్టు చంద్ర‌బాబు చేతిలో ఉంది. మ‌హాకూట‌మి మ‌న భ‌విష్య‌త్ కుళ్ల‌బొడ‌వాల‌ని చూస్తోంది అన్నారు.

మ‌హాకూట‌మి సీట్లు పంచుకునే లోపు మ‌నం స్వీట్లు పంచుకుంటాం. మ‌హాకూట‌మి అధికారంలోకి వ‌స్తే..రైతుల‌కు అన్యాయం జ‌రుగుతుంది. టీడీపీకి క్యాడ‌ర్ లేదు. కాంగ్రెస్ కు లీడ‌ర్ లేరు అని చెప్పారు. మహాకూటమి ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరనేది ఇంతవరకు ప్రకటించలేదని ఆయన విమర్శించారు. కూటమిలో అందరూ సీఎం అభ్యర్థులేనని కేటీఆర్‌ అన్నారు. ఒక‌వేళ‌ మహాకూటమి అధికారంలోకి వస్తే…నెలకొకరు సీఎంగా ఉంటారని, ఏ పదవి కావాలన్నా ఢిల్లీకి వెళ్లాల్సిందే అన్నారు. సీల్డ్‌ కవర్‌ ముఖ్యమంత్రి కావాలా.. సింహం లాంటి సీఎం కేసీఆర్‌ కావాలా? అని కేటీఆర్ ప్రశ్నించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here