Home Political News మ‌హాకూట‌మి సీట్ల స‌ర్ధుబాటు తేలేది ఎప్పుడు..?

మ‌హాకూట‌మి సీట్ల స‌ర్ధుబాటు తేలేది ఎప్పుడు..?

81
0

టీఆర్ఎస్ ను ఓడించాల‌నే ల‌క్ష్యంతో ఏర్ప‌డిన‌ మ‌హాకూట‌మి..సీట్ల స‌ర్ధుబాటు విష‌యంలో మాత్రం చాలా ఇబ్బందులు ఎదుర్కొంటుంది. ఈ కూటమిలో ఉన్న పార్టీల‌తో ఎన్ని సార్లు చ‌ర్చ‌లు జ‌రిపినా…క్లారిటీ మాత్రం రావ‌డం లేదు. దీంతో ఈ కూట‌మికి అభ్య‌ర్ధుల ఎంపిక అనేది క‌ష్టంగా మారింది. ఎట్ట‌కేల‌కు సీట్ల స‌ర్ధుబాటు ఒ కొలిక్కి వ‌చ్చింద‌ని అనుకుంటున్న త‌రుణంలో మ‌ళ్లీ మొద‌ట‌కి వ‌చ్చింది. దీంతో మిత్ర ప‌క్షాలు అడిగిన సీట్లు ఇవ్వ‌లేమ‌ని కాంగ్రెస్ తేల్చి చెప్పేసింద‌ట‌.

వాస్తవానికి కూటమిలో టీడీపీ 15, టీజేఎస్‌ 10, సీపీఐ 5 స్థానాల్లో పోటీ చేయాలని సంఖ్యాపరంగా నిర్ణయానికి వచ్చాయి. కానీ..తాజా స‌మాచారం ప్ర‌కారం టీడీపీకి 9, టీజేఎస్ కు 3, సీపీఐకి 2 సీట్లు ఇస్తామని కాంగ్రెస్ తెలిపిందని… నిన్న రాత్రి కాంగ్రెస్ పార్టీ స్క్రీనింగ్ కమిటీ భేటీలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారని వార్త‌లు వ‌స్తున్నాయి.కోదండరామ్, సీపీఐని బుజ్జగించేందుకు ఢిల్లీ నుంచి ప్రత్యేక దూతలు వస్తున్నట్టు సమాచారం.

కోదండరామ్ కు డిప్యూటీ సీఎం లేదా రాజ్యసభ పదవిని అప్పగించాలనే యోచనలో కాంగ్రెస్ ఉంది. ఎన్నికల్లో పోటీ చేయాలనుకున్న సీపీఐ ఆశావహులకు కార్పొరేషన్ పదవులు ఇస్తామని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. మరోవైపు టీడీపీ మాత్రం సీట్లు ముఖ్యం కాదు… టీఆర్ఎస్ ను ఓడించడమే లక్ష్యమని చెబుతోంది. కూటమి తరఫునా పాక్షిక ఉమ్మడి అజెండాను 31న విడుదల చేయాలని కూటమి పార్టీల నేతలు ప్రాథమికంగా నిర్ణయించినట్లు సమాచారం. న‌వంబ‌ర్ 1న మ‌హాకూట‌మి త‌రుపున పోటీ చేసే అభ్య‌ర్ధుల‌ను ప్ర‌క‌టించాల‌నుకున్నారు కానీ…ఇప్పుడు న‌వంబ‌ర్ 1న కూడా ప్ర‌క‌టిస్తారో లేదో చూడాలి..!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here