Home Actor మ‌హాన‌టికి అరుదైన గౌర‌వం..!

మ‌హాన‌టికి అరుదైన గౌర‌వం..!

130
0

అలనాటి నటి సావిత్రి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన సంచ‌ల‌న‌ చిత్రం మహానటి. కీర్తి సురేష్ సావిత్రిగా న‌టించిన ఈ సినిమా విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు అందుకుంది. అంతే కాకుండా…బాక్సాఫీస్ వ‌ద్ద కాసుల వ‌ర్షం కురిపించింది. ఈ సినిమాలో సావిత్రి పాత్ర‌ను అద్భుతంగా పోషించి కీర్తి సురేష్ ప్రేక్ష‌క హృద‌యాల్లో చెర‌గ‌ని ముద్ర వేసింది. ప‌లు అవార్డుల‌ను గెలుచుకున్న మ‌హాన‌టి తాజాగా అరుదైన ఘ‌న‌త‌ను సొంతం చేసుకుంది. 

ఇంత‌కీ విష‌యం ఏంటంటే…ప్రతిష్టాత్మక షాంఘై ఇంట‌ర్నేష‌న‌ల్ ఫిలిం ఫెస్టివల్ కు సెలెక్ట్ అయిన ఇండియన్ సినిమాగా ఘనత సాధించింది. చైనాలోని షాంఘైలో జూన్ 15నుండి 24 వరకు ఈ ఫెస్టివల్ జ‌ర‌గ‌నుంది. ఈ ఫెస్టివల్ లో మహానటి సినిమాను ప్రదర్శించనున్నారు. నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ఈ చిత్రంలో మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్ , సమంత , విజయ్ దేవరకొండలు ముఖ్య పాత్రల్లో నటించారు. ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ వైజ‌యంతీ మూవీస్ ప్ర‌తిష్టాత్మ‌కంగా ఈ చిత్రాన్ని నిర్మించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here