Home Telugu మ‌హాన‌టి గురించి ప‌రుచూరి ప‌లుకులు..!

మ‌హాన‌టి గురించి ప‌రుచూరి ప‌లుకులు..!

176
0

ప‌రుచూరి బ్ర‌ద‌ర్స్…తెలుగు సినిమా ప‌రిశ్ర‌మ‌లో వీళ్ల‌దో చ‌రిత్ర‌. 300ల‌కు పైగా సినిమాల‌కు ర‌చ‌యిత‌గా వ‌ర్క్ చేయ‌డం అంటే మామూలు విష‌యం కాదు. ఇందులో ఎన్నో హిట్లు, సూప‌ర్ హిట్లు, ఇండ‌స్ట్రీ హిట్లు ఉన్నాయి. కాలం మారినా…వీరి క‌లం బ‌లంలో మాత్రం ఎలాంటి మార్పు లేదు. వీరు రాసిన కొన్ని క‌థ‌లు ఫెయిల్ అయి ఉండ‌చ్చు కానీ…డైలాగులు మాత్రం ఎప్పుడూ ఫెయిల్ అవ్వ‌లేదు. నాటి నుంచి నేటి వ‌ర‌కు ఎన్నో సినిమాల‌కు వ‌ర్క్ చేసిన త‌ర్వాత సాధార‌ణంగా ఎవ‌రైనా అయితే…రిలాక్స్ అయిపోతారు కానీ…ప‌రుచూరి గోపాల‌కృష్ణ ప్ర‌జెంట్ ట్రెండ్ ఫాలో అవుతూ…సామాన్యుడి మీడియా అయిన సోష‌ల్ మీడియాలో సైతం బాగా యాక్టీవ్ గా ఉంటూ ప‌రుచూరి ప‌లుకులు అనే యూట్యూబ్ ఛాన‌ల్ ద్వారా త‌న అనుభ‌వాల‌ను, అభిప్రాయాల‌ను పంచుకుంటూ ఎంతో మందికి స్పూర్తిగా నిలుస్తున్నారు. తాజాగా మ‌హాన‌టి సినిమా గురించి త‌న మ‌న‌సును ఆవిష్క‌రించారు. మ‌రి…ఆయ‌న మ‌న‌సులో మాట‌లు ఏమిటో క్లుప్తంగా మీకోసం..!

ఈ చిత్రానికి సావిత్రి ఆత్మ‌క‌థ‌…అల‌నాటి సావిత్రి…ఇలా టైటిల్స్ పెట్ట‌చ్చు కానీ..ప్ర‌తి వాడి హృద‌యంలో సావిత్రి అని ప‌లికితే మ‌హాన‌టి అని ఆన‌ర్స్ వ‌స్తుంది. అదే టైటిల్ గా పెట్ట‌డంలోనే  నాగ్ అశ్విన్ తొలి విజ‌యం సాధించాడు. సినిమా చూస్తున్నంత సేపు…అంద‌రి త‌ల‌లు అంద‌రి క‌ళ్లు వెండి తెర వైపే ఉన్నాయి త‌ప్పా…ఒక్కసారి కూడా ప‌క్క‌కు తిప్ప‌డం లేదు. దీనిని బ‌ట్టి అర్ధం చేసుకోవ‌చ్చు మ‌హాన‌టి ఎంత అద్భుతంగా ఉందో.

ఆమె జీవిత గాథ‌ను సినిమాగా తీసారంటే…డాక్యుమెంట‌రీ చూడబోతున్నాం అని ప్రిపేర్ అయి ధియేట‌ర్ లో కూర్చుంటాం కానీ..నాగ్ అశ్విన్ చేసిన మాయ ఏంటంటే…ఇందులో అద్భుత‌మైన రెండు ల‌వ్ స్టోరీస్ ఇన్ వాల్వ్ చేసాడు. మొద‌టిది జెమినీ గ‌ణేష‌న్, సావిత్రిల ప్రేమ‌క‌థ అయితే, రెండోది ఆంటోని (విజ‌య్ దేవ‌ర‌కొండ‌), మ‌ధుర‌వాణి (స‌మంత) పాత్ర‌ల మ‌ధ్య‌ అద్భుత‌మైన ప్రేమ‌క‌థ‌.  చాలా మంది యూత్ ఈ సినిమా చూడ‌డానికి వ‌స్తున్నారంటే కార‌ణం..ఇందులో అద్భుత‌మైన ప్రేమ‌క‌థ ఉండ‌డ‌మే.

సావిత్రి జెమినీ గ‌ణేష్ ని పెళ్లి చేసుకోవ‌డం ఏంటి.? ఎందుకు చేసుకుంది..?  అనేది కాకుండా…అత‌న్ని చేసుకోక‌పోతే ఎట్లా అనేలా ట్రీట్ మెంట్ రాసాడు.అలాగే అత‌నికి దూరం కాక‌పోతే ఎట్లా..?  అనేలా ట్రీట్ మెంట్ రాసాడు. ఈ విధంగా న‌లిగిపోక‌పోతే ఎట్లా..?  అనేలా ఆమె జీవితంలో జ‌రిగిన సంఘ‌ట‌న‌ల‌ను అద్భుతంగా సెల్యూలాయిడ్ పైకి మ‌ల‌చాడు నాగ్ అశ్విన్.  ఇక కీర్తి సురేష్ సావిత్రి పాత్రకు స‌రిపోతుందా అని అనుకుంటామ‌ని ప్రారంభంలోనే కెవి రెడ్డి సీన్ చూపించాడు.  ఓ సీన్ లో ఎడ‌మ కంటిలో మాత్రం క‌న్నీరు రావాలి అంటే…ఎన్ని చుక్క‌లండి అని అడుగుతుంది. రెండు చుక్క‌లు అని చెబుతారు. ఇది క్రియేష‌న్ కాదు. ఒరిజిన‌ల్ గా జ‌రిగిందే. బ‌ళ్లారి రాఘ‌వ గారు ఒక కంటి నుంచి క‌న్నీరు మ‌రో కంటి నుంచి కోపాన్ని చూపించేవారు భ‌క్త ప్ర‌హ్లాద‌లో అని విన్నాం. అలాగే మ‌హాన‌టి సావిత్రి గారు అలా చేసార‌ని మాకు తెలుసు కానీ..కీర్తి సురేష్‌ ఆ షాట్ ని ఎలా చేస్తుంది అనుకుంటే..అద్భుతంగా చేసింది.

చిన్న‌తనంలో మాయాబ‌జార్ చూసిన‌ప్పుడు  అహ‌నా పెళ్లంట అని పాట వ‌చ్చిన‌ప్పుడు జ‌నం ఎలా చ‌ప్ప‌ట్లు కొట్టారో.. ఈల‌లు వేసారో..అలాగే చ‌ప్ప‌ట్లు కొట్టారు..అలాగే ఈల‌లు వేసారు.అంటే… అక్క‌డ సావిత్రి గారిని చూసారా..?   లేక‌  కీర్తి సురేష్ ని పూనిన సావిత్రి గారిని చూసారా..? అంటే… చెప్ప‌లేంమండి. ఒళ్లు పుల‌క‌రించిపోయింది అంతే..!

ఎస్వీరంగారావు గారి  పాత్ర‌లో మోహ‌న్ బాబు గారు క‌నిపిస్తారు. చూస్తున్న‌ది మోహ‌న్ బాబు గారినా..?  ఎస్వీ రంగారావు గారినా..?  అనేది అర్ధం కాదు. అంత‌లా ఆ పాత్ర‌లో అతుక్కుపోయాడు మోహ‌న్ బాబు గారు. ఆ పాత్ర‌లో జీవించేసాడు. మాయా బ‌జార్ లో ఎస్వీరంగారావు గారు ఎంత బ‌రువు మోసారో…ఈ సినిమాలో ఆ ఘ‌ట్టానికి మోహ‌న్ బాబు గారు అంత బ‌రువు మోసారు. కె.వి.రెడ్డి గారు, చ‌క్ర‌పాణి, సింగీతం శ్రీనివాస‌రావు..ఇలా ఆయా పాత్ర‌ల‌కు క‌రెక్ట్ గా స‌రిపోయారు. ముఖ్యంగా ప్ర‌కాష్ రాజ్, క్రిష్ పాత్ర‌ల‌ను అబ్జ‌ర్వ్ చేస్తే..వీళ్ల‌ను ఎలా మేక‌ప్ చేయించారు అనిపిస్తుంది. మేక‌ప్ యూనిట్ కి సెల్యూట్.

అలాగే ఆర్ట్ డిపార్టెమెంట్ 1950కి వెళ్లిపోయి అప్పుడు ఎలా ఉండేదో అలాగే చూపించారు. మేక‌ప్, కాస్ట్యూమ్స్, ఆర్ట్ డిపార్ట్ మెంట్, న‌టీన‌టులు..ఇలా ఒక్క‌రేమిటి అంద‌రూ ఈ సినిమాకి జీవం పోసారు. అందుకే సావిత్రి గారి న‌ట జీవితంలోకి నిజ జీవితంలోకి మ‌నంద‌రం వెళ్లిపోయాం.  అప్ప‌ట్లో ప్ర‌తిఘ‌ట‌న చూడ‌లేదా..? అని అడిగేవారు. ఆత‌ర్వాత‌ శంక‌రాభ‌ర‌ణం చూడ‌లేదా అని అడిగేవారా..? క‌ర్త‌వ్యం చూడ‌లేదా..? మ‌గ‌ధీర చూడ‌లేదా..?  బాహుబ‌లి చూడ‌లేదా..?  ఇలా కొన్ని సినిమాలను మాత్ర‌మే చూడ‌లేదా అని అడుగుతుంటారు.  ఈరోజు మ‌హాన‌టి చూడ‌లేదా..?  అని అడుగుతున్నారు.  అంటే మ‌హాన‌టి చూడాలి అని ఎదుట వారికి కూడా చెబుతున్నారు. దీనినే మౌత్ ప‌బ్లిసిటీ అంటారు.

ఈరోజున స్వ‌ప్న‌ద‌త్, ప్రియాంక ద‌త్ వాళ్ల తండ్రికి డ‌బ్బుని సంపాదించి పెట్టారు. ఒక మ‌హాన‌టి జీవితాన్ని అచ్చు గుద్ది కీర్తిని సంపాదించి పెట్టారు. వీరిద్ద‌రి జీవితం ఈ సినిమాతో ధ‌న్యం అయ్యింది.  నాగ‌చైత‌న్య చూస్తే..ఆరోజుల్లో మేము చూసిన నాగేశ్వ‌ర‌రావు గారే గుర్తుకొచ్చారు.  రామారావు గారిని కూడా ఒక షాట్ లో అద్భుతంగా చూపించారు. ప్ర‌తి థియేట‌ర్ లో సావిత్రి గారు కూర్చొని ఆడియ‌న్స్ కొడుతున్న చ‌ప్ప‌ట్లు చూసి ఆనంద ప‌డుతుంద‌ని భావిస్తూ…మ‌హాన‌టి తీసిన వారికి.. రాసిన వారికి.. చేసిన వారికి… అంద‌రికి మ‌హాన‌టి అభిమానిగా..శ‌భాకాంక్ష‌లు అంటూ మ‌హాన‌టి గురించి త‌న మ‌న‌సులో మాట‌లు… ప‌రుచూరి ప‌లుకులు… ద్వారా తెలియ‌చేసారు..!

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here