Home Political News మ‌హా కూట‌మి అధికారంలోకి వ‌స్తే..తెలంగాణ ప్రాజెక్టుల‌ను చంద్ర‌బాబు క‌ట్ట‌నిస్తాడా..? – కేటీఆర్

మ‌హా కూట‌మి అధికారంలోకి వ‌స్తే..తెలంగాణ ప్రాజెక్టుల‌ను చంద్ర‌బాబు క‌ట్ట‌నిస్తాడా..? – కేటీఆర్

117
0

మంత్రి కేటీఆర్‌ సమక్షంలో ఈరోజు వివిధ పార్టీల నేతలు టీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ… టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం భవిష్యత్‌ తరాల కోసం పని చేస్తోందన్నారు. కాంగ్రెస్‌ పార్టీలాగా తప్పుడు హామీలు ఇవ్వలేమని, ఎన్నికల కోసం కాంగ్రెస్‌ ఆచరణ సాధ్యంకాని హామీలు ఇస్తోందని విమర్శించారు. ప్రతి ఎకరాకు సాగునీరు ఇచ్చేందుకే ప్రాజెక్టులు నిర్మిస్తున్నామన్నారు. గురుకుల ద్వారా 3 లక్షల మంది విద్యార్థులకు ప్రపంచ స్థాయి విద్య అందిస్తున్నామని ఆయన తెలిపారు.

చనిపోయిన వారి వేలుముద్రలతో కాళేశ్వరం పై కేసులు వేశారని మండిపడ్డారు. ప్రజాకోర్టులో తేల్చుకుందామనే ఎన్నికలకు పోతున్నామని, పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌‌కుమార్‌రెడ్డివి ఉత్తుత్తి మాటలే అన్నారు. ఓట‌ర్ల లిస్ట్ లో పేర్ల‌ను మేము ఎందుకు తొల‌గిస్తాం అని ప్ర‌శ్నించారు. ఓట్లు ఎక్కువు ఉంటే మాకే మెజార్టీ పెరుగుతుంది. ద‌క్షిణాది రాష్ట్రాల బ‌డ్జెట్ క‌లిపినా కాంగ్రెస్ ఇచ్చే హామీలు అమ‌లు కావు. బీజేపీ హామీల‌కు న‌వ్వాలో ఏడ‌వాలో అర్ధం కావ‌డం లేదు అన్నారు.

బీజేపీ నేత‌లు ఒక‌రు కిరాయి క‌డ‌తాం అంటారు. మ‌రొక‌రు పెళ్లి కాని అబ్బాయిల‌కు పిల్ల‌ను వెతికిపెడ‌తామంటారు. తెలంగాణ ప్రాజెక్టులు ఆపాల‌ని చంద్రబాబు కేంద్రానికి 30 లేఖ‌లు రాసారు. పొర‌పాటున మ‌హా కూట‌మి అధికారంలోకి వ‌స్తే..తెలంగాణ ప్రాజెక్టుల‌ను చంద్ర‌బాబు క‌ట్ట‌నిస్తాడా..? రాష్ట్రం సాధించుకున్నాక కూడా ఢిల్లీకి గులాములుగా ఉందామా అని ప్ర‌శ్నించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here