Home Actor మ‌హేష్‌..సుకుమార్ పై సెటైర్ వేసేసాడుగా..!

మ‌హేష్‌..సుకుమార్ పై సెటైర్ వేసేసాడుగా..!

71
0

సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు – సూప‌ర్ హిట్ చిత్రాల ద‌ర్శ‌కుడు వంశీ పైడిప‌ల్లి కాంబినేష‌న్ లో రూపొందుతోన్న భారీ చిత్రం మ‌హ‌ర్షి. ఇది మ‌హేష్ కి 25వ చిత్రం కావ‌డం విశేషం. సినీ ప్ర‌ముఖులు, అభిమానుల స‌మ‌క్షంలో మ‌హ‌ర్షి ప్రీ రిలీజ్ ఈవెంట్ హైద‌రాబాద్ లోని పీపుల్స్ ప్లాజాలో గ్రాండ్ గా జ‌రిగింది. ఈ వేడుక‌లో మ‌హేష్ డైరెక్ట‌ర్ వంశీ పైడిప‌ల్లి గురించి మాట్లాడుతూ…వంశీ క‌థ చెబుతాను అన్న‌ప్పుడు ఓ ప‌ది నిమిషాలు క‌థ విని పంపించేద్దాం అనుకున్నాను.

ఎందుకంటే.. నాకు ఆల్రెడీ రెండు మూడు సినిమాలు కమిట్ మెంట్స్ ఉన్నాయి. ఈ సినిమా చేసే సమయం ఉండదని అలా అనుకున్నాను. కానీ వంశీ నేరేషన్ 20 నిముషాలు వినగానే నేను ఈ సినిమా చేయాలంటే ముందు రెండు సినిమాలు చేయాలి.. అ తర్వాతే కుదురుతుంది అని వంశీ తో చెప్పాను. ‘నో ప్రాబ్లెం సర్. రెండేళ్ళయినా మీకోసం వెయిట్ చేస్తాను. ఎందుకంటే మీరు తప్ప ఈ కథలో నేను వేరే ఎవరినీ ఊహించలేను అన్నాడు.

 ఆ విషయంలో నీకెప్పుడూ రుణపడి ఉంటాను వంశీ. ఈరోజుల్లో ఏ డైరెక్టర్ ద‌గ్గ‌రైనా క‌థ ఉంటే.. ఒక టూ మంత్స్ డిలే అయినా సరే.. వేరే హీరోల దగ్గరకు వెళ్ళిపోతారు. కానీ వంశీ అలా వెళ్ల‌కుండా నాకోసం రెండేళ్ళు వెయిట్ చేసాడు. నిజానికి వంశీ  రెండేళ్ళు కాదు.. మూడేళ్ళు వెయిట్ చేశాడు. ఇప్ప‌టి వ‌ర‌కు నేను వ‌ర్క్ చేసిన డైరెక్ట‌ర్స్ ని సార్ అనే పిలుస్తుంటాను కానీ..వంశీ నాకు యంగ‌ర్ బ్ర‌ద‌ర్ లాంటోడు. అందుకే వంశీ అని పేరు పెట్టి పిలుస్తున్నాను. థ్యాంక్ యూ వంశీ అన్నారు.

ఏ డైరెక్ట‌ర్ ద‌గ్గ‌రైనా క‌థ ఉంటే…ఒక హీరో ద‌గ్గ‌ర టు మంత్స్ డిలే అయితే..వేరే హీరో ద‌గ్గ‌ర‌కి వెళ్లిపోతున్నాడు అనేది సుకుమార్ ని దృష్టిలో పెట్టుకునే మ‌హేష్ అలా అన్నాడ‌ని..సోష‌ల్ మీడియాలో కామెంట్స్ వ‌స్తున్నాయి. సుకుమార్ మ‌హేష్ కి క‌థ చెప్ప‌డం…వెయిట్ చేయాలి అని చెప్పాడో ఏం జ‌రిగిందో కానీ…స‌డ‌న్ గా సుక్కు బ‌న్నీకి వెళ్లి క‌థ చెప్ప‌డం..అఫిషియ‌ల్ గా ఎనౌన్స్ మెంట్ రావ‌డం తెలిసిందే. సుకుమార్ ఇలా చేయ‌డంతో మ‌హేష్ కి బాగా కోపం వ‌చ్చిన‌ట్టుంది. అందుకే మ‌హ‌ర్షి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో సుక్కు పై మ‌హేష్ సెటైర్ వేసేసాడు అంటూ వార్త‌లు వ‌స్తున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here