Home Actor మ‌హేష్ గారి రుణం తీర్చుకుంటాను – అనిల్ రావిపూడి..!

మ‌హేష్ గారి రుణం తీర్చుకుంటాను – అనిల్ రావిపూడి..!

78
0

సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు 26వ చిత్రం స‌రిలేరు నీకెవ్వ‌రు. ఈ చిత్రానికి స‌క్స‌స్ ఫుల్ డైరెక్ట‌ర్ అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. దిల్ రాజు, అనిల్ సుంక‌ర‌, మ‌హేష్ బాబు ఈ ముగ్గురు క‌లిసి ఈ సినిమాని నిర్మిస్తుండ‌డం విశేషం. సినీ ప్ర‌ముఖుల స‌మ‌క్షంలో అన్న‌పూర్ణ స్టూడియోలో ఈ చిత్రం ప్రారంభ‌మైంది. అనంత‌రం ఏర్పాటు చేసిన మీడియా స‌మావేశంలో డైరెక్ట‌ర్ అనిల్ రావిపూడి మాట్లాడుతూ… నా జీవితంలో ఎప్పటికీ గుర్తుండిపోయే రోజు ఇది. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన  మహేష్ బాబు గారిని నేను ఎప్పటికీ మరిచిపోలేను.

ఈ సినిమాతో ఆయనకి హిట్ ఇచ్చి ఆయన రుణం తీర్చుకుంటాను. ఈ చిత్రంలో విజ‌య‌శాంతి గారు న‌టిస్తున్నారు. ఈ సినిమాలో న‌టించేందుకు అంగీక‌రించిన విజ‌య‌శాంతి గారికి థ్యాంక్స్ తెలియ‌చేస్తున్నాను. తెలుగులో ఆమె మొద‌టి చిత్రం కిలాడి కృష్ణుడు. సూప‌ర్ స్టార్ కృష్ణ గారితో. ఆత‌ర్వాత 180 సినిమాలు చేసారు. 13 సంవ‌త్స‌రాల విరామం త‌ర్వాత  సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు గారితో న‌టిస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంద‌ని విజ‌య‌శాంతి గారు తెలియ‌చేసారు.  ఇందులో జ‌గ‌ప‌తి బాబు గారు ముఖ్య‌పాత్ర పోషిస్తున్నారు. ఆయ‌న‌కు స్పెష‌ల్ థ్యాంక్స్ తెలియ‌చేస్తున్నాను.

 మ‌హేష్ స‌ర‌స‌న ర‌ష్మిక న‌టిస్తుంది. దేవిశ్రీప్ర‌సాద్ గారితో ఎఫ్ 2 చేసాను. మ‌ళ్లీ ఆయ‌న ఈ సినిమాతో జాయిన్ అవ‌బోతున్నారు. 2020… సంక్రాంతికి రాబోతున్నాం. ఖ‌చ్చితంగా అంద‌రికీ న‌చ్చే చిత్రం అవుతుంది. అంద‌ర్నీ ఎంట‌ర్ టైన్ చేస్తాం. మ‌హేష్ గారి నుంచి కోరుకునే అన్ని ఎలిమెంట్స్ ఇందులో ఉంటాయ‌ని చెబుతున్నాను.  స‌రిలేరు నీకెవ్వ‌రు టైటిల్ ప‌క్క‌న గ‌న్, ఆర్మీ హెల్మెట్ పెట్ట‌డం జ‌రిగింది. సినిమాలో మ‌హేష్ గారు ఆర్మీ మేజ‌ర్ క్యారెక్ట‌ర్ చేయ‌బోతున్నారు.  ఖ‌చ్చితంగా కంటెంట్ కి క‌నెక్ట్ అవుతుంది కాబ‌ట్టే ఈ టైటిల్ పెట్టాం అని చెప్పారు.  

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here