Home Telugu మ‌హేష్ చేతుల మీదుగా శ్రీనివాస క‌ళ్యాణం ట్రైల‌ర్..!

మ‌హేష్ చేతుల మీదుగా శ్రీనివాస క‌ళ్యాణం ట్రైల‌ర్..!

100
0
Srinivasa kalyanam trailor

నితిన్ – రాశీఖ‌న్నా జంట‌గా న‌టించిన తాజా చిత్రం శ్రీనివాస క‌ళ్యాణం.  శ‌త‌మానం భ‌వ‌తి డైరెక్ట‌ర్ స‌తీష్ వేగేశ్న ద‌ర్శ‌క‌త్వంలో ఈ సినిమా రూపొందింది.  ఈ చిత్రాన్ని శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్ పై దిల్ రాజు నిర్మించారు. ఇటీవ‌ల రిలీజ్ చేసిన టీజ‌ర్ కు చాలా మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. ఫ్యామిలీ అంతా క‌లిసి చూసి ఎంజాయ్ చేసేలా ఈ సినిమా ఉంటుంద‌ని తెలుస్తుంది. మిక్కీ జే మేయ‌ర్ సంగీతం అందించిన ఈ పాట‌ల‌కు విశేష స్పంద‌న ల‌భిస్తోంది.

దాదాపు ఓ 60 మంది నటీనటులతో.. తెలుగింటి పెళ్లి కళ ఉట్టిపడేలా ఈ చిత్రాన్ని రూపొందించారు. ఇటీవ‌ల రిలీజ్ చేసిన  ఈ మూవీ మేకింగ్ వీడియోకు కూడా మంచి స్పందన వచ్చింది. ఇక ఈ మూవీ ట్రైల‌ర్ సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు రేపు సాయంత్రం 5.30 నిమిషాల‌కు రిలీజ్ చేయ‌నున్నారు. ఈ సినిమా చూసిన త‌ర్వాత పెళ్లి కావాల్సిన అమ్మాయిలు, అబ్బాయిలు ఈ మూవీలో చూపించిన‌ట్టుగా పెళ్లి చేసుకోవాల‌ను కుంటార‌ని అంటున్నారు.

అంతే కాకుండా..ఈ సినిమాలో న‌టించిన త‌ర్వాత పెళ్లి చేసుకోవాల‌నిపిస్తోంది అని నితిన్ చెప్ప‌డం విశేషం.  ఇటీవ‌ల వ‌రుస ఫ్లాప్స్ తో స‌త‌మ‌త‌మౌతోన్న నితిన్ ఈ సినిమా పై చాలా ఆశ‌లు పెట్టుకున్నాడు. ఆగ‌ష్టు 9న ఈ చిత్రాన్నిరిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు. మ‌రి..అంచ‌నాల‌కు త‌గ్గ‌ట్టు శ్రీనివాస క‌ళ్యాణం విజ‌యం సాధిస్తుంద‌ని ఆశిద్దాం.


 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here