Home Actor మ‌హేష్ తో మ‌హేష్ – సింప్లీ సూప‌ర్..!

మ‌హేష్ తో మ‌హేష్ – సింప్లీ సూప‌ర్..!

84
0


సూపర్ స్టార్ మ‌హేష్ బాబుకి  క్రేజ్ ఏరేంజ్ లో ఉంటుందో అంద‌రికీ తెలిసిందే. అందుక‌నే ప్రఖ్యాత మేడమ్ టుస్సాడ్ మ్యూజియం నిర్వాహకులు ఆయన మైనపు విగ్రహాన్ని తయారు చేసారు. అచ్చం మహేష్‌ ను పోలిన మైనపు విగ్రహాన్ని గచ్చిబౌలిలోని మహేష్ కు చెందిన ఏఎంబీ సినిమాస్‌ థియేటర్‌లో మహేష్‌ బాబు, మేడమ్ టుస్సాడ్స్ గ్రూప్ సభ్యులు ఆవిష్కరించారు. బ్లాక్‌ సూట్‌లో తీర్చిదిద్దిన మహేష్ మైనపు బొమ్మ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది.

ఈ కార్యక్రమానికి మహేష్‌ కుటుంబ స‌భ్యుల‌తో పాటు భారీ సంఖ్యలో అభిమానులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మైనపు విగ్రహంతో కలసి మహేష్ భార్య‌ న‌మ్ర‌త‌, పిల్లలు సితార, గౌతమ్‌ ఫొటో దిగారు. మహేష్‌ అభిమానుల కోసం ఒక రోజు పాటు విగ్రహాన్ని హైదరాబాద్‌కు తీసుకొచ్చారు. రేపు ఉదయమే మళ్లీ దీనిని సింగపూర్‌కు తరలించే ఏర్పాట్లు చేయనున్నట్లు తెలుస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here