Home Actor మ‌హేష్ తో సందీప్ రెడ్డి సినిమా ఉందా..? లేదా..?

మ‌హేష్ తో సందీప్ రెడ్డి సినిమా ఉందా..? లేదా..?

152
0

సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు న‌టించిన మ‌హ‌ర్షి చిత్రం 100 కోట్ల‌కు పైగా షేర్ సాధించి సెన్సేష‌న్ క్రియేట్ చేసింది. ప్ర‌స్తుతం మ‌హేష్, స‌క్స‌స్ ఫుల్ డైరెక్ట‌ర్ అనిల్ రావిపూడితో స‌రిలేరు నీకెవ్వ‌రు సినిమా చేస్తున్నారు. వ‌చ్చే నెల‌లో సెట్స్ పైకి వెళ్లే ఈ సినిమా సంక్రాంతికి ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఇదిలా ఉంటే…ఈ సినిమా త‌ర్వాత మ‌హేష్ ఎవ‌రితో సినిమా చేయ‌నున్నాడు అనేది ఆస‌క్తిగా మారింది.

ఎందుకంటే…మ‌హేష్ తో సినిమా చేయ‌డానికి వెయిట్ చేస్తోన్న ద‌ర్శ‌కుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ప‌ర‌శురామ్ మ‌హేష్ కి క‌థ చెప్పారు. లైన్ న‌చ్చ‌డంతో ఫుల్ స్ర్కిప్ట్ రెడీ చేయ‌మ‌న్నారు. మ‌హ‌ర్షి సినిమా స‌క్స‌స్ అవ్వ‌డంతో వంశీ పైడిప‌ల్లితో మ‌రో సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చారు. మ‌హేష్ తో సుకుమార్ కూడా సినిమా చేయాల‌నుకుంటున్నారు. అయితే..వీరంద‌రి కంటే ముందు నుంచి అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డి వంగా మ‌హేష్ కోసం క‌థ రెడీ చేస్తున్నారు.

స‌రిలేరు నీకెవ్వ‌రు మ‌హేష్ కి 26వ సినిమా. 27వ సినిమా ప‌రశురామ్ తో కానీ..వంశీ పైడిప‌ల్లితో కానీ ఉండ‌చ్చు అని టాక్ వినిపిస్తోంది. ఈ నేప‌ధ్యంలో సందీప్ రెడ్డితో మ‌హేష్ సినిమా ఉంటుదా..? ఉండ‌దా..? అనేది ఆస‌క్తిగా మారింది. ఇదే విష‌యం గురించి సందీప్ ని అడిగితే…స్టోరీ లైన్‌ మహేష్‌కు చెప్పాను. ఆయ‌న‌కు లైన్ నచ్చటంతో పూర్తి కథ సిద్ధం చేయమన్నారు. ఫుల్ స్టోరీ చెప్పిన తరువాత సినిమా పై క్లారిటీ వస్తుందన్నారు. అదీ..సంగ‌తి..!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here