Home Actor మ‌హేష్ ని మెప్పించిన బ్లాక్ బ‌ష్ట‌ర్ డైరెక్ట‌ర్..!

మ‌హేష్ ని మెప్పించిన బ్లాక్ బ‌ష్ట‌ర్ డైరెక్ట‌ర్..!

89
0


సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు న‌టిస్తోన్న మ‌హ‌ర్షి చిత్రం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ జ‌రుపుకుంటోంది. వంశీ పైడిప‌ల్లి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న ఈ భారీ చిత్రం మే 9న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ సినిమా త‌ర్వాత సెన్సేష‌న‌ల్ డైరెక్ట‌ర్ అనిల్ రావిపూడితో సినిమా చేయ‌నున్నారు. ప్ర‌స్తుతం ప్రీ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ జ‌రుగుతోంది. త్వ‌ర‌లో సెట్స్ పైకి వెళ్ళేందుకు రెడీ అవుతోంది. ఇదిలా ఉంటే…గీత గోవిందం సినిమాతో బ్లాక్ బ‌ష్ట‌ర్ సొంతం చేసుకున్న ప‌ర‌శురామ్ తో యువ హీరోలు సిన‌మా చేసేందుకు ఇంట్ర‌స్ట్ చూపిస్తున్నారు.

అయితే…ప‌ర‌శురామ్ మాత్రం మ‌హేష్ బాబుతో సినిమా చేయాల‌నుకుంటున్నాడ‌ట‌. ఇటీవ‌ల మ‌హేష్ కి ప‌ర‌శురామ్ స్టోరీ లైన్ చెప్ప‌డం.. లైన్ న‌చ్చ‌డంతో ఫుల్ స్ర్కిప్ట్ రెడీ చేయ‌మ‌ని మ‌హేష్ బాబు చెప్ప‌డం జ‌రిగింద‌ని తెలిసింది. ప్ర‌స్తుతం ప‌ర‌శురామ్ ఫుల్ స్టోరీ రెడీ చేసే ప‌నిలో ఉన్నాడ‌ట‌. అన్నీ అనుకున్న‌ట్టుగా జ‌రిగితే ఈ మ‌హేష్ – ప‌ర‌శురామ్ కాంబినేష‌న్ లో రూపొందే సినిమాని గీతా ఆర్ట్స్ బ్యాన‌ర్ పై అల్లు అర‌వింద్ నిర్మించ‌నున్నారు. మ‌రి..స్టోరీ లైన్ తో మెప్పించిన ప‌ర‌శురామ్…ఫుల్ స్ర్కిప్ట్ తో కూడా మెప్పిస్తాడా..?  లేదా..? అనేది తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే..!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here