Home Movie News మ‌హేష్ ప్ర‌శంస‌ల పై విమ‌ర్శ‌లు..!

మ‌హేష్ ప్ర‌శంస‌ల పై విమ‌ర్శ‌లు..!

97
0
Mahesh-Babu-pic

సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబుకు ఏ సినిమా అయినా న‌చ్చితే..ఆ సినిమా గురించి ట్విట్ట‌ర్ ద్వారా త‌న అభిప్రాయాన్ని తెలియ‌చేస్తుంటారు. తాజాగా మ‌ణిర‌త్నం తెర‌కెక్కించిన న‌వాబ్ గురించి మ‌హేష్ బాబు ట్విట్ట‌ర్ లో స్పందిస్తూ…ఈ సినిమా పై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించారు. చెక్క చివంత వానం(తెలుగులో నవాబ్‌)  అద్భుతమైన నటన.. ఏఆర్‌ రెహమాన్‌కు మాత్రమే సాధ్యమైన మ్యూజిక్‌, సంతోష్‌ శివన్‌ క్లాస్‌ సినిమాటోగ్రఫి. మణిరత్నం అభిమానిగా చెన్నై థియేటర్లలో చప్పట్లు కొడుతూ ఆయన సినిమాలు చూశాను.

ఇప్పుడు అదే పని నా హోం థియేటర్లో గర్వంగా చేశాను. ఇంకా మీరు సినిమా చూడనట్టైతే వెంటనే వెళ్లి టికెట్స్‌ తీసుకోండి. ఓ క్లాసిక్‌ చూసిన భావన కలుగుతుంది. ఈ దశాబ్దపు ఉత్తమ చిత్రం. ద మాస్టర్‌ ఈజ్‌ బ్యాక్‌ అంటూ ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించాడు. ఇటీవ‌ల కాలంలో మ‌ణిర‌త్నం తెర‌కెక్కించిన సినిమాలు ఆశించిన స్ధాయిలో ఆక‌ట్టుకోక‌పోవ‌డంతో న‌వాబ్ సినిమా పై అంత‌గా క్రేజ్ ఏర్ప‌డ‌లేదు. తీరా రిలీజ్ అయ్యాకా న‌వాబ్ సెన్సేష‌న్ క్రియేట్ చేస్తుంది.

ఇదిలా ఉంటే..మ‌హేష్ బాబు న‌వాబ్ సినిమాని ఈ ద‌శాబ్ద‌పు ఉత్త‌మ చిత్రం అన‌డం పై విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. న‌వాబ్ సినిమా బాగుంది. అయితే..ఈ సినిమాని ఈ ద‌శాబ్ద‌పు ఉత్త‌మ చిత్రం అన‌డం కాస్త ఓవ‌ర్ గా అనిపిస్తుంది మ‌హేష్ అని అంటున్నారు నెటిజ‌న్లు. అదీ..సంగ‌తి..!

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here