Home Actor మ‌హేష్ బాబు మ‌హ‌ర్షి ఏప్రిల్ 25న వ‌స్తుందా..? రాదా..?

మ‌హేష్ బాబు మ‌హ‌ర్షి ఏప్రిల్ 25న వ‌స్తుందా..? రాదా..?

79
0

సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు – స‌క్సస్ ఫుల్ డైరెక్ట‌ర్ వంశీ పైడిప‌ల్లి కాంబినేష‌న్ లో రూపొందుతోన్న చిత్రం మ‌హ‌ర్షి. ఈ సినిమాని ప్ర‌ముఖ నిర్మాత‌లు అశ్వ‌నీద‌త్, దిల్ రాజు, పీవీపీ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మ‌హేష్ స‌ర‌స‌న పూజా హేగ్డే న‌టిస్తుంటే…కీల‌క పాత్ర‌లో అల్ల‌రి న‌రేష్ న‌టిస్తున్నారు. అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మిస్తోన్న ఈ చిత్రాన్ని ఏప్రిల్ 5న రిలీజ్ చేయాలి అనుకున్నారు కానీ.. కుద‌ర‌క‌పోవ‌డంతో ఏప్రిల్ 25న రిలీజ్ చేయ‌నున్న‌ట్టు చిత్ర నిర్మాత‌ల్లో ఒక‌రైన దిల్ రాజు అఫిషియ‌ల్ గా ఎనౌన్స్ చేసారు.

అయితే.. తాజాగా మ‌హ‌ర్షి సినిమా గురించి ఓ వార్త బ‌య‌ట‌కు వ‌చ్చింది. అది ఏంటంటే…అనుకున్న విధంగా ఏప్రిల్ 25న మ‌హ‌ర్షి ప్రేక్ష‌కుల ముందుకు రావ‌డం లేద‌ని ఫిల్మ్ న‌గ‌ర్ లో టాక్ వినిపిస్తోంది. కార‌ణం ఏంటంటే…కొన్ని సీన్స్ లో ఎమోష‌న్ అనుకున్న విధంగా రాలేద‌ట‌. అందుచేత మ‌హేష్ బాబు ఆ సీన్స్ ని రీషూట్ చేయ‌మంటున్నార‌ట‌. అందుచేత ఏప్రిల్ 25న కాకుండా జూన్ లో రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు అని వార్త‌లు వ‌స్తున్నాయి. మ‌రి…ప్ర‌చారంలో ఉన్న ఈ వార్త‌ల పై మ‌హ‌ర్షి టీమ్ క్లారిటీ ఇస్తుందేమో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here