Home Telugu మ‌హేష్ బాబు 25వ సినిమా గురించి ఇంట్ర‌స్టింగ్ న్యూస్..!

మ‌హేష్ బాబు 25వ సినిమా గురించి ఇంట్ర‌స్టింగ్ న్యూస్..!

97
0

భ‌ర‌త్ అనే నేను సినిమాతో సంచ‌ల‌న విజయం సాధించిన సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు త‌న 25వ సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడు. ఈ భారీ చిత్రానికి వంశీ పైడిప‌ల్లి ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్నారు. అశ్వ‌నీద‌త్ – దిల్ రాజు సంయుక్తంగా  నిర్మిస్తున్నఈ సినిమాలో మ‌హేష్ స‌ర‌స‌న పూజా హేగ్డే న‌టిస్తోంది. అమెరికాలో ఎక్కువ రోజులు షూటింగ్ ప్లాన్ చేస్తుండ‌డంతో యు.ఎస్ బ్యాక్ డ్రాప్ తో రూపొందే సినిమా అనుకున్నారు కానీ…రాయ‌ల‌సీమ బ్యాక్ డ్రాప్ తో ఈ సినిమా ఉంటుంద‌ని గ‌త కొన్ని రోజులుగా వార్త‌లు వ‌స్తున్నాయి.

తాజాగా ఈ మూవీ గురించి ఓ ఇంట్ర‌స్టింగ్ న్యూస్ బ‌య‌ట‌కు వ‌చ్చింది. అది ఏమిటంటే…ఈ సినిమాలో మ‌హేష్ మీస‌క‌ట్టుతో క‌నిపిస్తాడ‌ట‌. భ‌ర‌త్ అనే నేను సినిమాలో ఓ సాంగ్ లో కొంచెం సేపు మ‌హేష్ మీస‌క‌ట్టుతో క‌నిపించాడు. మ‌హేష్ ని అలా చూస్తుంటే…కృష్ణ గారిని చూసిన‌ట్టే అనిపించింది. ఫ్యాన్స్ అయితే…చాలా హ్యాపీగా ఫీల‌య్యారు. మ‌రి…భ‌ర‌త్ అనే నేను లో మ‌హేష్ ని మీసంతో చూసిన త‌ర్వాత ఐడియా వ‌చ్చిందో..లేక ముందు నుంచి ఆలోచ‌న ఉందో కానీ… ఈ వార్త తెలిసిన‌ప్ప‌టి నుంచి మ‌హేష్ మీసంతో ఉన్న లుక్ కోసం ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు.

కొంత మంది ఫ్యాన్స్ అయితే…మీసంతో మ‌హేష్ ఎలా ఉంటారో ఫోటోలు డిజైన్ చేసి సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. నిజంగానే ఈ సినిమాలో మ‌హేష్ మీసంతో క‌నిపిస్తాడా..?  ఒక‌వేళ క‌నిపిస్తే..భ‌ర‌త్ అనే నేను సినిమాలో క‌నిపించిన‌ట్టు ఓ సాంగ్ లో క‌నిపిస్తాడా..?  లేక సినిమా అంతా మీసంతో ఉంటాడా..?  అనేది తెలియాల్సివుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here