Home Actor మ‌హేష్ మూవీకి ఆ టైటిలే ఫిక్స్ చేసారా..?

మ‌హేష్ మూవీకి ఆ టైటిలే ఫిక్స్ చేసారా..?

121
0

సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు – స‌క్స‌స్ ఫుల్ డైరెక్ట‌ర్ అనిల్ రావిపూడి కాంబినేష‌న్ లో భారీ చిత్రం రూపొంద‌నున్న విష‌యం తెలిసిందే. ఈ చిత్రాన్ని అనిల్ సుంక‌ర నిర్మిస్తున్నారు. రేపు సూప‌ర్ స్టార్ కృష్ణ పుట్టిన‌రోజు. ఈ సంద‌ర్భంగా ఈ సినిమాని ప్రారంభించ‌నున్నారు. ఈ మూవీకి స‌రిలేరు నీకెవ్వ‌రు అనే టైటిల్ ప‌రిశీలిస్తున్న‌ట్టు వార్త‌లు వ‌చ్చాయి. ఆత‌ర్వాత ఈ టైటిల్ కాదు రెడ్డి గారి అబ్బాయి అనే టైటిల్ అనుకుంటున్నార‌ని ప్ర‌చారం జ‌రిగింది.

లేటెస్ట్ న్యూస్ ఏంటంటే… అనిల్ సుంక‌ర స‌రిలేరు నీకెవ్వ‌రు అనే టైటిల్ ను రిజిష్ట‌ర్ చేయించార‌ట‌. అయితే…మ‌హేష్ అభిమానులు మాత్రం మ‌హేష్ కి టైటిల్ విష‌యంలో మూడు అక్ష‌రాల సెంటిమెంట్ ఉంది క‌దా..ఆ ప్ర‌కారం మూడు అక్ష‌రాల టైటిల్ పెడితే బాగుంటుంద‌ని చెప్పార‌ట‌. దీంతో అనిల్ రావిపూడి, అనిల్ సుంక‌ర ఆలోచ‌న‌లో ప‌డ్డార‌ట‌. పోకిరి, మ‌హ‌ర్షి ఇలా డిఫ‌రెంట్ గా ఉండే మూడక్ష‌రాల టైటిల్ పెట్టాల‌నుకుంటున్నార‌ని తెలిసింది.

అందుచేత‌నే సినిమా ప్రారంభోత్స‌వం రోజున టైటిల్ ఎనౌన్స్ చేయ‌డం లేద‌ట‌. వ‌చ్చే నెల‌లో షూటింగ్ ప్రారంభించే ఈ సినిమాని సంక్రాంతి కానుక‌గా రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు.  

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here