Home Actor మ‌హేష్ మూవీలో ఉపేంద్ర‌. ఇది నిజ‌మేనా..?

మ‌హేష్ మూవీలో ఉపేంద్ర‌. ఇది నిజ‌మేనా..?

80
0


సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు ప్ర‌స్తుతం మ‌హ‌ర్షి సినిమా చేస్తున్నారు. వంశీ పైడిప‌ల్లి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న ఈ భారీ చిత్రం చెన్నైలో షూటింగ్ జ‌రుపుకుంటోంది. మే 9న ప్ర‌పంచ వ్యాప్తంగా మ‌హ‌ర్షి చిత్రాన్ని రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే…ఈ సినిమా త‌ర్వాత మ‌హేష్ బాబు..అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో సినిమా చేయ‌నున్నారు. దిల్ రాజు, అనిల్ సుంక‌ర సంయుక్తంగా నిర్మించే ఈ మూవీని జూన్ లో సెట్స్ పైకి తీసుకెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నారు.

ఈ సినిమాలో క‌న్న‌డ స్టార్ హీరో ఉపేంద్ర కీల‌క పాత్ర పోషించ‌నున్నారు అని వార్త‌లు వ‌స్తున్నాయి. అయితే…ఉపేంద్ర క‌న్న‌డ‌లో న‌టించిన ఓ సినిమాని తెలుగులో ఐ ల‌వ్ యు టైటిల్ తో రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమా ప్ర‌మోష‌న్ లో భాగంగా హైద‌రాబాద్ వ‌చ్చిన ఉపేంద్రను మ‌హేష్ మూవీలో న‌టిస్తున్నార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి నిజ‌మేనా..?  అని అడిగితే…ఈ మూవీ గురించి త‌న‌ని సంప్ర‌దించ‌డం వాస్త‌వ‌మే కానీ..బిజీగా ఉండ‌డం వ‌ల‌న ఇంకా క‌థ విన‌లేదు అని చెప్పారు. మ‌రి..క‌థ విని ఓకే చెబుతారా..?  లేక నో చెబుతారా..?  అనేది తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here