Home Actor మ‌హేష్ మూవీలో విజ‌య‌శాంతి..?

మ‌హేష్ మూవీలో విజ‌య‌శాంతి..?

98
0


సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు ప్ర‌స్తుతం మ‌హ‌ర్షి సినిమాలో న‌టిస్తున్నారు. వంశీ పైడిప‌ల్లి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న ఈ భారీ చిత్రం శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటోంది. మే 9న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేందుకు రెడీ అవుతోంది. ఈ సినిమా త‌ర్వాత మ‌హేష్..అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేయ‌నున్నాడు. ఈ భారీ చిత్రాన్ని దిల్ రాజు స‌మ‌ర్ప‌ణ‌లో అనిల్ సుంక‌ర నిర్మించ‌నున్నార‌ని తెలిసింది. ప్ర‌స్తుతం ప్రీ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ జ‌రుగుతోంది. త్వ‌ర‌లో సెట్స్ పైకి వెళ్లేందుకు రెడీ అవుతోంది.

అయితే…ఈ మూవీలో విజ‌య‌శాంతి న‌టించ‌నున్న‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి. 2006లో నాయుడ‌మ్మ సినిమా త‌ర్వాత విజ‌య‌శాంతి సినిమాల్లో న‌టించ‌లేదు. రాజ‌కీయాల్లో ప్ర‌వేశించారు. గ‌త ఎన్నిక‌ల్లో తెలంగాణ‌లో కాంగ్రెస్ పార్టీ త‌రుపున ప్ర‌చారం చేసారు. ఇటీవ‌ల అనిల్ రావిపూడి విజ‌య‌శాంతికి క‌థ చెప్పార‌ని…ఇందులో ఆమె పాత్ర న‌చ్చి ఓకే చెప్పార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. గ‌తంలో మ‌హేష్, విజ‌య‌శాంతి క‌లిసి కొడుకు దిద్దిన కాపురం చిత్రంలో న‌టించారు.

ఈ సినిమాలో విజ‌య‌శాంతి, మ‌హేష్ త‌ల్లీకొడుకులుగా న‌టించారు. మ‌రి..అనిల్ రావిపూడితో చేయ‌నున్న సినిమాలో కూడా విజ‌య‌శాంతి త‌ల్లి పాత్ర పోషించ‌నుందా..?  లేక వేరే కీల‌క పాత్ర చేయ‌నున్నారా..? అస‌లు ప్ర‌చారంలో ఉన్న ఈ వార్త నిజ‌మేనా..?  అనేది తెలియాల్సివుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here