Home Actor మ‌హేష్ మూవీ టైటిల్ ఇదేనా..?

మ‌హేష్ మూవీ టైటిల్ ఇదేనా..?

144
0

సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు న‌టించిన మ‌హ‌ర్షి రికార్డు స్ధాయి క‌లెక్ష‌న్స్ తో స‌క్స‌స్ ఫుల్ గా ర‌న్ అవుతున్న విష‌యం తెలిసిందే. ఈ సినిమా త‌ర్వాత మ‌హేష్ స‌క్స‌స్ ఫుల్ డైరెక్ట‌ర్ అనిల్ రావిపూడితో సినిమా చేయ‌నున్నాడు. ప్ర‌స్తుతం ప్రీ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ జ‌రుగుతోంది. వ‌చ్చే నెల‌లో ఈ సినిమాని ప్రారంభించ‌నున్నారు. ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్ ఎంట‌ర్ టైన‌ర్ గా రూపొందుతోన్న ఈ సినిమాని అనిల్ సుంక‌ర నిర్మిస్తున్నారు.

అయితే…ఈ మూవీకి స‌రిలేరు నీకెవ్వ‌రు అనే టైటిల్ ప‌రిశీలిస్తున్న‌ట్టు వార్త‌లు వ‌చ్చాయి. ఆత‌ర్వాత మ‌హేష్ కి మూడ‌క్ష‌రాల సెంటిమెంట్ ఉంది. అందుచేత టైటిల్ మూడ‌క్ష‌రాల్లో ఉండాల‌ని అనిల్ రావిపూడికి మ‌హేష్ చెప్పిన‌ట్టు టాక్ వ‌చ్చింది. ఏ టైటిల్ పెడ‌తారా అనుకుంటే..ఇప్పుడు తాజాగా మరో టైటిల్ ప్ర‌చారంలోకి వ‌చ్చింది. ఆ టైటిల్ ఏంటంటే…రెడ్డి గారి అబ్బాయి. ఈ సినిమా రాయ‌ల‌సీమ బ్యాక్ డ్రాప్ లో ఉంటుంద‌ట‌.

అందుక‌నే రెడ్డి గారి అబ్బాయి అనే టైటిల్ పెడితే బాగుంటుంద‌ని ఆలోచిస్తున్న‌ట్టు జోరుగా ప్ర‌చారం జ‌రుగుతుంది. ప్ర‌చారంలో ఉన్న‌ది నిజ‌మేనా..?  ఒక‌వేళ నిజ‌మే అయినా…మూడ‌క్ష‌రాల టైటిల్ కాకుండా ఈ టైటిల్ కి మ‌హేష్ ఒప్పుకుంటాడా అనేది ఆస‌క్తిగా మారింది.  

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here