Home Actor మ‌హేష్ మూవీ నుంచి దిల్ రాజు త‌ప్పుకున్నాడా..?

మ‌హేష్ మూవీ నుంచి దిల్ రాజు త‌ప్పుకున్నాడా..?

60
0

సూపర్ స్టార్ మ‌హేష్ బాబు తాజా చిత్రం మ‌హ‌ర్షి. వంశీ పైడిప‌ల్లి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న ఈ భారీ చిత్రాన్ని అశ్వ‌నీద‌త్, దిల్ రాజు, పీవీపీ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మే 1 ప్రీ రిలీజ్ ఈవెంట్ ను గ్రాండ్ గా జ‌రుపుక‌నే ఈ సినిమా మే 9న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేందుకు రెడీ అవుతోంది. ఈ సినిమా త‌ర్వాత మ‌హేష్ బాబు అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేయ‌నున్న విష‌యం తెలిసిందే.

ప్ర‌స్తుతం ప్రీ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ జ‌రుగుతోంది. ఈ సినిమాని అనిల్ సుంక‌ర‌, దిల్ రాజు సంయుక్తంగా నిర్మించ‌నున్నారు అని జోరుగా ప్ర‌చారం జ‌రిగింది. త్వ‌ర‌లోనే అఫిషియల్ గా ఈ మూవీ గురించి ఎనౌన్స్ చేయాల‌నుకుంటున్నారు. అయితే…ఈ మూవీ నుంచి దిల్ రాజు త‌ప్పుకున్నారు అని ఓ వార్త బ‌య‌ట‌కు వ‌చ్చింది. మ‌హ‌ర్షి సినిమాకి ముగ్గురు నిర్మాత‌లు. అందువ‌ల‌న ఇబ్బందులు ఏర్ప‌డ్డాయి.

ఈ ఎక్స్ పీరియ‌న్స్ ని దృష్టిలో పెట్టుకుని మ‌హేష్ బాబు… త‌దుప‌రి చిత్రానికి ఇద్ద‌రు నిర్మాత‌లు కాకుండా ఒక్క‌రే ఉండాలని చెప్పారో..ఏమో కానీ…మ‌హేష్ – అనిల్ రావిపూడి ప్రాజెక్ట్ నుంచి దిల్ రాజు త‌ప్పుకున్నారు అనేది టాక్ వినిపిస్తోంది. మ‌రి.. మ‌హ‌ర్షి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో క్లారిటీ ఇస్తారేమో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here