Home Telugu మ‌హేష్ మూవీ ఫ‌స్ట్ లుక్ కి ముహుర్తం ఖ‌రారు..!

మ‌హేష్ మూవీ ఫ‌స్ట్ లుక్ కి ముహుర్తం ఖ‌రారు..!

116
0
mahesh-look-release date

సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు – వంశీ పైడిప‌ల్లి కాంబినేష‌న్లో రూపొందుతోన్న భారీ చిత్రం ఫ‌స్ట్ షెడ్యూల్ పూర్తి చేసుకుంది. ఇందులో మ‌హేష్ స‌ర‌స‌న పూజా హేగ్డే న‌టిస్తుంటే..కీల‌క పాత్ర‌లో అల్ల‌రి న‌రేష్ న‌టిస్తున్నాడు. అశ్వ‌నీద‌త్ – దిల్ రాజు సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ భారీ చిత్రం ఇటీవ‌ల డెహ్ర‌డూన్ లో ప్రారంభ‌మైన విష‌యం తెలిసిందే. 24 రోజులు పాటు షూటింగ్ జ‌రుపుకున్న ఈ షెడ్యూల్ పూర్త‌య్యింది. తాజా షెడ్యూల్ ను అమెరికాలో ప్లాన్ చేస్తున్నారు.

ఇదిలా ఉంటే…ఈ చిత్రానికి టైటిల్ రాజ‌సం అంటూ ప్రచారం జ‌రిగింది. తాజాగా రైతు బిడ్డ అనే టైటిల్ ప‌రిశీలిస్తున్నారు అంటూ ఓ వార్త బ‌య‌ట‌కు వ‌చ్చింది. రైతుల స‌మ‌స్య‌ల నేప‌ధ్యంలోనే ఈ సినిమా ఉంటుంద‌ట‌. అందుచేత రైతు బిడ్డ అనే టైటిల్ క‌రెక్ట్ గా సూట్ అవుతుంది అనుకుంటున్నార‌ట‌. లేటెస్ట్ న్యూస్ ఏంటంటే…ఈ మూవీ ఫ‌స్ట్ లుక్ & టైటిల్ మ‌హేష్ పుట్టిన‌రోజైన ఆగ‌ష్టు 9న ఎనౌన్స్ చేయాల‌నుకుంటున్నార‌ట‌. సో..మ‌హేష్ పుట్టినరోజు నాడు అభిమానుల‌కు పండ‌గే..!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here