Home Actor మ‌హేష్ మ‌హ‌ర్షి గురించి ఇంట్ర‌స్టింగ్ న్యూస్..!

మ‌హేష్ మ‌హ‌ర్షి గురించి ఇంట్ర‌స్టింగ్ న్యూస్..!

59
0


సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు – స‌క్స‌స్ ఫుల్ డైరెక్ట‌ర్ వంశీ పైడిప‌ల్లి కాంబినేష‌న్ లో రూపొందుతోన్న భారీ చిత్రం మ‌హ‌ర్షి. ఈ సినిమాలో మ‌హేష్ స‌ర‌స‌న పూజా హేగ్డే న‌టిస్తుంటే…అల్ల‌రి న‌రేష్ కీల‌క పాత్ర పోషిస్తున్నారు. భ‌ర‌త్ అనే నేను త‌ర్వాత మ‌హేష్ చేస్తోన్న సినిమా కావ‌డం..అలాగే ఇది మ‌హేష్ కి 25వ సినిమా కావ‌డంతో ఈ సినిమాని ఎప్పుడెప్పుడు చూద్దామా అని అభిమానులు ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే..మే 9న ప్ర‌పంచ వ్యాప్తంగా రిలీజ్ చేయ‌నున్న‌ట్టు ఇటీవ‌ల చిత్ర నిర్మాత‌ల్లో ఒక‌రైన దిల్ రాజు అఫిషియ‌ల్ గా ఎనౌన్స్ చేసారు.

ఇప్పుడు ఈ మూవీ గురించి ఓ ఇంట్ర‌స్టింగ్ న్యూస్ బ‌య‌ట‌కు వ‌చ్చింది. అది ఏంటంటే…రాక్ స్టార్ దేవిశ్రీప్ర‌సాద్ ట్విట్ట‌ర్ లో స్పందిస్తూ…మ‌హ‌ర్షి ఫ‌స్ట్ సింగిల్ ను ఈ నెల 29న రిలీజ్ చేయ‌నున్న‌ట్టు తెలియ‌చేసారు. మ‌హేష్ కి 25వ సినిమా కావ‌డంతో ప్రీ రిలీజ్ ఈవెంట్ ను భారీ స్ధాయిలో నిర్వ‌హించేందుకు నిర్మాత‌ల్లో ఒక‌రైన దిల్ రాజు ప్లాన్ చేస్తున్నారు.  భారీ తారాగ‌ణంతో రూపొందుతోన్న‌ ఈ మ‌హ‌ర్షి చిత్రం హై టెక్నిక‌ల్ వేల్యూస్ తో రూపొందుతోంది.  

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here