Home Actor మ‌హేష్, సుకుమార్ ప్రాజెక్ట్ క్యాన్సిల్. అస‌లు ఏమైంది..?

మ‌హేష్, సుకుమార్ ప్రాజెక్ట్ క్యాన్సిల్. అస‌లు ఏమైంది..?

65
0


సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు – క్రియేటివ్ డైరెక్ట‌ర్ సుకుమార్ కాంబినేష‌న్ లో 1 నేనొక్క‌డినే సినిమా రూపొందిన విష‌యం తెలిసిందే. రంగ‌స్థ‌లం త‌ర్వాత వీరిద్ద‌రు క‌లిసి సినిమా చేయాల‌నుకున్నారు. అయితే…సుకుమార్ రెండు, మూడు క‌థ‌లు చెప్పాడట‌ కానీ…మ‌హేష్ కి న‌చ్చ‌లేదు. ఆత‌ర్వాత ఎఫ్ 2 సినిమాతో సెన్సేష‌న్ క్రియేట్ చేసిన అనిల్ రావిపూడి మ‌హేష్ కి క‌థ చెప్ప‌డం…వెంట‌నే ఓకే చెప్పాడం జ‌రిగింద‌ని న్యూస్ వ‌చ్చింది. 

ఆత‌ర్వాత సుకుమార్ చెప్పిన క‌థ‌ని కూడా మ‌హేష్ ఓకే చేసార‌ట‌. అయితే… అనిల్ రావిపూడితో చేయ‌నున్న సినిమాతో పాటే సుకుమార్ సినిమాని కూడా చేస్తాన‌ని మ‌హేష్ చెప్పార‌ట‌. మ‌రి…ఆత‌ర్వాత ఏమైందో ఏమో కానీ…ఊహించ‌ని విధంగా సుకుమార్, అల్లు అర్జున్ కాంబినేష‌న్ లో మూవీ అంటూ అఫిషియ‌ల్ గా ఎనౌన్స్ మెంట్ వ‌చ్చింది.

ఈ ఎనౌన్స్ మెంట్ త‌ర్వాత మ‌హేష్ బాబు ట్విట్ట‌ర్ లో స్పందిస్తూ…క్రియేటివ్ డిఫ‌రెన్స్ రావడంతో సుకుమార్ తో సినిమా చేయడం లేదు.  కొత్త ప్రాజక్ట్ ప్రకటించిన సుకుమార్ కు ఆల్ ది బెస్ట్. అంతా మంచే జరగాలని ఆశిస్తున్నాను. ఓ అద్భుతమైన ఫిలిం మేకర్ గా సుకుమార్ ను ఎప్పుడూ గౌరవిస్తాను. 1 నేనొక్కడినే మూవీ ఎప్పటికీ ఓ కల్ట్ క్లాసిక్ గా మిగిలిపోతుంది. ఆ సినిమాకు పని చేసిన సమయంలో ప్రతి క్షణం ఎంజాయ్ చేసాను అని తెలియ‌చేసారు. అదీ..సంగ‌తి..!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here