Home Movie News మ‌హేష్ – సుక్కు మూవీ ఏ త‌ర‌హా చిత్ర‌మో తెలుసా..?

మ‌హేష్ – సుక్కు మూవీ ఏ త‌ర‌హా చిత్ర‌మో తెలుసా..?

85
0

సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు – స‌క్స‌స్ ఫుల్ డైరెక్ట‌ర్ వంశీ పైడిప‌ల్లి కాంబినేష‌న్ లో రూపొందుతోన్న భారీ చిత్రం మ‌హ‌ర్షి. ఈ చిత్రంలో మ‌హేష్ స‌ర‌స‌న పూజా హేగ్డే న‌టిస్తోంది. అశ్వ‌నీద‌త్, దిల్ రాజు, పీవీపీ సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నారు. వైవిధ్య‌మైన క‌థాంశంతో రూపొందుతోన్న ఈ సినిమాని ఏప్రిల్ లో రిలీజ్ చేయ‌నున్నారు. ఇదిలా ఉంటే…ఈ సినిమా త‌ర్వాత మ‌హేష్ సుకుమార్ తో సినిమా చేయ‌నున్నాడు.

ప్ర‌స్తుతం సుకుమార్…మ‌హేష్ తో చేయనున్న సినిమా కోసం ఫుల్ స్ర్కిప్ట్ రెడీ చేస్తున్నారు. ఈ మూవీ ఏ త‌ర‌హా చిత్రం అనే విష‌యం పై ఓ వార్త బ‌య‌ట‌కు వ‌చ్చింది. అది ఏంటంటే..ఇది పిరియాడిక్ మూవీ అని టాక్ వినిపిస్తోంది. రంగ‌స్థ‌లం చిత్రంలో 1980 కాలాన్ని చూపిస్తే..ఈసారి మ‌రింత ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్ల‌నున్న‌ట్టు స‌మాచారం. స్వాతంత్ర్యం వ‌చ్చిన తొలినాళ్ల‌లో జ‌రిగే క‌థ‌తో ఈ సినిమా ఉంటుంద‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. మ‌రి.. ప్ర‌చారంలో ఉన్న వార్త‌ల పై సుకుమార్ స్పందిస్తారేమో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here