Home Actor మ‌హేష్ స‌రిలేరు నీకెవ్వ‌రు గురించి ఇంట్ర‌స్టింగ్ అప్ డేట్.

మ‌హేష్ స‌రిలేరు నీకెవ్వ‌రు గురించి ఇంట్ర‌స్టింగ్ అప్ డేట్.

38
0
మ‌హేష్ స‌రిలేరు నీకెవ్వ‌రు గురించి ఇంట్ర‌స్టింగ్ అప్ డేట్..! spiceandhra

సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు – స‌క్స‌స్ ఫుల్ డైరెక్ట‌ర్ అనిల్ రావిపూడి కాంబినేష‌న్ లో రూపొందుతోన్న భారీ చిత్రం స‌రిలేరు నీకెవ్వ‌రు. మ‌హేష్ స‌ర‌స‌న ర‌ష్మిక న‌టిస్తుంది. ఈ చిత్రాన్ని దిల్ రాజు, అనిల్ సుంక‌ర‌, మ‌హేష్ బాబు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కాశ్మీర్ లో ఫ‌స్ట్ షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్ర‌స్తుతం సెకండ్ షెడ్యూల్ షూటింగ్ జ‌రుపుకుంటోంది.

అయితే… ద‌ర్శ‌కుడు అనిల్ రావిపూడి ట్విట్ట‌ర్ లో స్పందిస్తూ… సెకండ్ షెడ్యూల్ షూటింగ్ ఫుల్ స్వింగ్ లో జరుగుతోంది.  సంక్రాంతికి థియేటర్లలో ఒక హిలేరియస్ ట్రైన్ జర్నీని చూడబోతున్నారు. సూపర్ స్టార్ మహేష్ గారు ఇచ్చే ఎంటర్టైన్మెంట్ కు సిద్ధంగా ఉండండి అంటూ మ‌హేష్ ట్రైన్ లో నిలుకున్న స్టిల్ పోస్ట్ చేసారు.

ఈ స్టిల్ అదిరింది అనేలా ఉంది. ఇందులో మ‌హేష్ బాబు అజ‌య్ కృష్ణ అనే ఆర్మీ మేజ‌ర్ గా న‌టిస్తున్నారు. సీనియ‌ర్ హీరోయిన్ విజ‌య‌శాంతి కీల‌క పాత్ర పోషిస్తుండడం విశేషం. సంక్రాంతికి ఈ సినిమాని భారీ స్ధాయిలో రిలీజ్ చేయ‌డానికి ఏర్పాట్లు చేస్తున్నారు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here