Home Actor మ‌హ‌ర్షి ఏప్రిల్ 5, ఏప్రిల్ 25, ఇప్పుడు..?

మ‌హ‌ర్షి ఏప్రిల్ 5, ఏప్రిల్ 25, ఇప్పుడు..?

89
0

సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు – స‌క్స‌స్ ఫుల్ డైరెక్ట‌ర్ వంశీ పైడిప‌ల్లి కాంబినేష‌న్ లో రూపొందుతోన్న భారీ చిత్రం మ‌హ‌ర్షి. హీరోయిన్ గా పూజా హేగ్డే న‌టిస్తుంటే…కీల‌క పాత్ర‌లో అల్ల‌రి న‌రేష్ న‌టిస్తున్నారు.  అశ్వ‌నీద‌త్, దిల్ రాజు, పీవీపీ సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ సినిమాని ఏప్రిల్ 5న రిలీజ్ చేయ‌నున్న‌ట్టు ఎనౌన్స్ చేసారు. ఆత‌ర్వాత కొన్ని కార‌ణాల వ‌ల‌న‌ అనుకున్న డేట్ కి రిలీజ్ చేయ‌డం కుద‌ర‌డం లేదు. ఏప్రిల్ 25న రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నాం అని చిత్ర నిర్మాత‌ల్లో ఒక‌రైన దిల్ రాజు ప్ర‌క‌టించారు.

దిల్ రాజు అఫిషియ‌ల్ గా ప్ర‌క‌టించిన‌ప్ప‌టికీ మ‌హ‌ర్షి ఏప్రిల్ లో రావ‌డం లేదు. జూన్ కి వాయిదా ప‌డింద‌ట‌ అంటూ వార్త‌లు వ‌చ్చాయి. ప్ర‌చారంలో ఉన్న ఈ వార్త‌ల పై ఇటీవ‌ల చిత్ర‌యూనిట్ స్పందించింది. ప్ర‌చారంలో ఉన్న వార్త‌ల్లో వాస్త‌వం లేదు. ఏప్రిల్ 25న మ‌హ‌ర్షి రిలీజ్ ప‌క్కా అంటూ సోష‌ల్ మీడియా ద్వారా తెలియ‌చేసారు. దీంతో మ‌హ‌ర్షి రావ‌డం ప‌క్కా అనుకున్నారు కానీ..ఏమైందో ఏమో కానీ…మ‌ళ్లీ మ‌హ‌ర్షి పోస్ట్ పోన్ అంటూ వార్త‌లు వ‌చ్చాయి.

లేటెస్ట్ న్యూస్ ఏంటంటే…మ‌హ‌ర్షి చిత్రాన్ని ఏప్రిల్ 25న కాకుండా మే 9న రిలీజ్ చేయాల‌నుకుంటున్నార‌ట‌. దీనికి కార‌ణం షూటింగ్ ఇంకా పూర్తి కాక‌పోవ‌డ‌మే అని తెలిసింది. ఈ డేట్ కైనా రిలీజ్ చేస్తారో..మ‌రోసారి పోస్ట్ పోన్ చేస్తారో..?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here