Home Actor మ‌హ‌ర్షి టీజ‌ర్ రిలీజ్ కి ముహుర్తం ఫిక్స్..!

మ‌హ‌ర్షి టీజ‌ర్ రిలీజ్ కి ముహుర్తం ఫిక్స్..!

78
0


సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు హీరోగా వంశీ పైడిప‌ల్లి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న భారీ చిత్రం మ‌హ‌ర్షి. అశ్వనీద‌త్, దిల్ రాజు, పీవీపీ సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నారు. మ‌హేష్ స‌ర‌స‌న‌ పూజా హేగ్డే న‌టిస్తుంటే..అల్ల‌రి న‌రేష్ కీల‌క పాత్ర పోషిస్తున్నారు. ఇటీవ‌ల చెన్నైలో కీల‌క స‌న్నివేశాల‌ను చిత్రీక‌రించారు. దీంతో టాకీ పార్ట్ మొత్తం కంప్లీట్ అయ్యింది.  రెండు పాటలను మాత్రమే చిత్రీకరించవలసి వుంది. ఏప్రిల్ రెండవ వారంలో ఈ పాటలను చిత్రీకరించడానికి ప్లాన్ చేశారు.

ఇక టీజ‌ర్ ను ఉగాది కానుక‌గా రిలీజ్ చేయ‌నున్నార‌ని స‌మాచారం. రాక్ స్టార్ దేవిశ్రీప్ర‌సాద్ సంగీతం అందిస్తున్నారు. దేవిశ్రీ సంగీతం ఈ సినిమా హైలైట్స్ లో ఒక‌టిగా నిలుస్తుంద‌ని అంటున్నారు. మే 9న భారీ స్ధాయిలో మ‌హ‌ర్షి చిత్రాన్ని రిలీజ్ చేయ‌నున్నారు. భ‌ర‌త్ అనే నేను సినిమా స‌క్స‌స్ త‌ర్వాత వ‌స్తోన్న మ‌హ‌ర్షి చిత్రం పై భారీ అంచ‌నాలు ఉన్నాయి. మ‌రి..అంచ‌నాల‌ను అందుకుని మ‌హేష్ మ‌రో విజ‌యాన్ని సొంతం చేసుకుంటాడేమో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here