Home Actor మ‌హ‌ర్షి నుంచి మ‌రో సాంగ్ వ‌చ్చేస్తుంది..!

మ‌హ‌ర్షి నుంచి మ‌రో సాంగ్ వ‌చ్చేస్తుంది..!

99
0

సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు లేటెస్ట్ మూవీ మ‌హ‌ర్షి. వంశీ పైడిప‌ల్లి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న ఈ భారీ చిత్రం చాలా ఫాస్ట్ గా పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ జ‌రుపుకుంటోంది. అల్ల‌రి న‌రేష్ కీల‌క పాత్ర పోషిస్తోన్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను మే 1న సినీ ప్ర‌ముఖులు, అభిమానులు స‌మ‌క్షంలో గ్రాండ్ గా చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. మే 9న‌ వ‌ర‌ల్డ్ వైడ్ గా ఈ చిత్రాన్ని రిలీజ్ చేయ‌నున్నారు.

ఇదిలా ఉంటే…ఈ సినిమాలోని ఒక్కొక్క పాట‌ను రిలీజ్ చేస్తోన్న విష‌యం తెలిసిందే. పాల‌పిట్ట అంటూ సాగే మాసీవ్ ఫోక్ సాంగ్ ను ఈ నెల 29న ఉద‌యం 9 గంట‌ల 9 నిమిషాల‌కు రిలీజ్ చేయ‌నున్న‌ట్టు డైరెక్ట‌ర్ వంశీ పైడిప‌ల్లి ట్విట్ట‌ర్ ద్వారా తెలియ‌చేసారు. రాక్ స్టార్ దేవిశ్రీప్ర‌సాద్ సంగీతం అందించిన ఈ పాట‌కు శ్రీమ‌ణి సాహిత్యం అందించారు. అశ్వ‌నీద‌త్, దిల్ రాజు, పీవీపీ సంయుక్తంగా నిర్మించిన ఈ భారీ చిత్రం మ‌హేష్ కి 25వ సినిమా కావ‌డంతో ఎప్పుడెప్పుడు ఈ సినిమాని చూస్తామా అని అభిమానులు ఎంతో ఆస‌క్తితో ఎదురు చూస్తున్నారు.  

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here