Home Actor మ‌హ‌ర్షి ఫ‌స్ట్ సాంగ్ అదిరింది..!

మ‌హ‌ర్షి ఫ‌స్ట్ సాంగ్ అదిరింది..!

104
0


సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు – వంశీ పైడిప‌ల్లి కాంబినేష‌న్ లో రూపొందుతోన్న భారీ చిత్రం మ‌హ‌ర్షి. ఈ చిత్రంలో మ‌హేష్ స‌ర‌స‌న పూజా హేగ్డే న‌టిస్తుంటే…అల్ల‌రి న‌రేష్ కీల‌క పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమాను మే 9వ తేదీన భారీస్థాయిలో విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో  ఈ సినిమా నుంచి ఒక లిరికల్ సాంగ్ ను రిలీజ్ చేసారు. చోటి .. చోటి ..  అంటూ ఈ సాంగ్ సాగుతోంది. కాలేజీ నేపథ్యంలో స్నేహంలోని గొప్పతనాన్ని ఆవిష్కరిస్తూ మహేష్‌, పూజా హెగ్డే, అల్లరి నరేష్‌ తదితరుల పై ఈ పాట చిత్రీక‌రించారు.

స్నేహం అంటే పుస్తకాలు చెప్పని పాఠం .. కన్నవాళ్లు ఇవ్వలేని ఆస్తి… అంటూ శ్రీమణి రాసిన సాహిత్యం బాగుంది. ఈ పాటకు రాక్ స్టార్ దేవిశ్రీ అందించిన మ్యూజిక్ యూత్ ను విశేషంగా ఆక‌ట్టుకుంటుంది. ఒక్క మాటలో చెప్పాలంటే… సాంగ్ అదిరింది. అశ్వనీద‌త్, దిల్ రాజు, పీవీపీ సంయుక్తంగా ఈ భారీ చిత్రాన్ని నిర్మిస్తోన్నారు. ఈ మూవీ మ‌హేష్ కి 25వ సినిమా కావ‌డంతో ఎప్పుడెప్పుడు ఈ సినిమాని చూస్తామా అని అభిమానులు ఆస‌క్తితో ఎదురు చూస్తున్నారు. మ‌రి..భ‌ర‌త్ అనే నేను సినిమాతో సంచ‌ల‌నం సృష్టించిన మ‌హేష్ మ‌హ‌ర్షి చిత్రంతో ఏరేంజ్ స‌క్స‌స్ సాధిస్తాడో చూడాలి..!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here