Home Actor మ‌హ‌ర్షి ఫ‌స్ట్ సాంగ్ రిలీజ్ కి ముహుర్తం ఫిక్స్..!

మ‌హ‌ర్షి ఫ‌స్ట్ సాంగ్ రిలీజ్ కి ముహుర్తం ఫిక్స్..!

116
0


సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు హీరోగా వంశీ పైడిప‌ల్లి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న భారీ చిత్రం మ‌హ‌ర్షి. ఈ చిత్రంలో మ‌హేష్ స‌ర‌స‌న పూజా హేగ్డే న‌టిస్తుంటే…అల్ల‌రి న‌రేష్ కీల‌క పాత్ర పోషిస్తున్నారు. భ‌ర‌త్ అనే నేను సినిమా త‌ర్వాత మ‌హేష్ చేస్తున్న సినిమా కావ‌డం…ఇది మ‌హేష్ కి 25వ చిత్రం కావ‌డంతో ఎప్పుడెప్పుడు ఈ సినిమాని చూద్దామా అని అభిమానులు ఆస‌క్తితో ఎదురు చూస్తున్నారు. ఇదిలా ఉంటే…ఈ మూవీ గురించి డైరెక్ట‌ర్ వంశీ పైడిప‌ల్లి ఫ్యాన్స్ కి ఓ స్వీట్ న్యూస్ ను ట్విట్ట‌ర్ ద్వారా తెలియ‌చేసారు.

ఇంత‌కీ ఆ న్యూస్ ఏంటంటే.. మహర్షి సినిమాలోని తొలి పాటను ఈనెల 29న ఉదయం 9 గంటల 9 నిమిషాలకు విడుదల చేయనున్నట్లు వంశీ పైడిప‌ల్లి ట్వీట్ చేశారు. మహర్షి మ్యూజికల్ జర్నీ స్టార్ట్ అవుతుంది. చోటీ చోటీ బాతే… పాటతో సూపర్ స్టార్ మహేష్‌బాబు, పూజా హెగ్డే, అల్లరి నరేష్‌తో మీ ఫ్రెండ్‌షిప్‌ను సెలబ్రేట్ చేసుకోవడానికి సిద్ధంగా ఉండండి.

దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. శ్రీమ‌ణి సాహిత్యం అందించారు అని తన ట్వీట్‌లో వంశీ పేర్కొన్నారు. దీంతో పాటు రిలీజ్ చేసిన పోస్ట‌ర్ విశేషంగా ఆక‌ట్టుకుంటుంది. అశ్వ‌నీద‌త్, దిల్ రాజు, పీవీపీ సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ భారీ చిత్రాన్ని మే 9న ప్ర‌పంచ వ్యాప్తంగా రిలీజ్ చేయ‌నున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here