Home Actor మ‌హ‌ర్షి రివ్యూ..!

మ‌హ‌ర్షి రివ్యూ..!

185
0

సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు న‌టించిన 25వ చిత్రం మ‌హ‌ర్షి. పూజా హేగ్డే క‌ధానాయిక.అల్ల‌రి న‌రేష్ కీల‌క పాత్ర పోషించారు.  వంశీ పైడిప‌ల్లి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఈ సినిమాని అశ్వ‌నీద‌త్, దిల్ రాజు, పీవీపీ సంయుక్తంగా నిర్మించారు. థియేట్రిక‌ల్ ట్రైల‌ర్ రిలీజ్ చేసిన‌ప్ప‌టి నుంచి ఈ సినిమా పై అంచ‌నాలు అమాంతం పెరిగాయి. ఈ రోజు మ‌హ‌ర్షి ప్ర‌పంచ వ్యాప్తంగా రిలీజైంది. మ‌రి…మ‌హ‌ర్షి అంచ‌నాల‌ను అందుకున్నాడా..?  లేదా..?  అనేది చెప్పాలంటే ముందుగా క‌థ చెప్పాల్సిందే.

క‌థ – రిషి కుమార్ (మ‌హేష్ బాబు)  అమెరికాలోని ఆరిజ‌న్ కంపెనీకి సి.ఇ.ఒ. రిషి త‌ను అనుకున్న‌ది సాధించాల‌నుకుంటాడు. అత‌నికి స‌క్స‌స్ ఒక్క‌టే క‌నిపిస్తుంటుంది. ఓడిపోవ‌డం అంటే భ‌యం. అందుకే ఎల్ల‌ప్పుడూ స‌క్స‌స్ నే కోరుకుంటుంటాడు. రిషి పి.ఎ(మీనాక్షి దీక్షిత్‌)  వైజాగ్ ఐ.ఐ.ఇ.టి కాలేజ్‌లో ఎంటెక్ పూర్వ విద్యార్థుల‌ను లెక్చ‌ర‌ర్‌ని ఆహ్వానించి రిషికి స‌ర్ ఫ్రైజ్ ఇస్తుంది. స‌డ‌న్ గా త‌న క్లాస్ మేట్స్ ను లెక్చ‌ర‌ర్ ని చూసేస‌రికి రిషి చాలా హ్యాపీగా ఫీల‌వుతాడు. అయితే.. పూజా (పూజా హేగ్డే) ర‌వి (అల్ల‌రి న‌రేష్) వీరిద్ద‌రు రిషి క్లాస్ మేట్సే. వీరిద్ద‌రు ఎందుకు రాలేద‌ని అడుతాడు.

కాలేజీలో ఉన్న‌ప్పుడు పూజా రిషిని ప్రేమిస్తుంది. రిషి కూడా ఓకే చెబుతాడు కానీ…ఓరోజు మాత్రం ఇద్ద‌రి సెట్ కాదు ఈ రిలేష‌న్ షిప్ ని ఇక్క‌డే వ‌దిలేద్దాం అంటాడు. ఇక ర‌వి..త‌ను చ‌దవ‌లేక‌పోతున్నాను అంటూ భ‌య‌ప‌డుతుంటే.. రిషి ధైర్యం నింపుతాడు.  రిషి, పూజా, ర‌వి ఈ ముగ్గురు మంచి ఫ్రెండ్స్. అయితే…ర‌వి గురించి రిషికి లెక్చ‌ర‌ర్ ఓ విష‌యం చెబుతారు. అది విని రిషి చాలా బాధ‌ప‌డ‌తాడు. వెంట‌నే ర‌విని వెతుక్కుంటూ రామాపురం వ‌చ్చేస్తాడు. అస‌లు ర‌వికి ఏమైంది..?  లెక్చ‌ర‌ర్ ఏం చెప్పారు..?  త‌న లైఫ్ జ‌ర్నీలో రిషి కాస్త మ‌హ‌ర్షిగా ఎలా మారాడు అనేదే ఈ సినిమా క‌థ‌.

ప్లస్ పాయింట్స్

మ‌హేష్ – అల్ల‌రి న‌రేష్ న‌ట‌న‌

ఇంట‌ర్వెల్ ముందు వ‌చ్చే ఎమోష‌న‌ల్ సీన్

క‌థ‌నం

దేవిశ్రీ సంగీతం

మైనస్ పాయింట్స్

పాత సినిమాలు గుర్తుకురావ‌డం..

లెంగ్త్ ఎక్కువ అవ్వ‌డం

విశ్లేష – మ‌హేష్ 25వ సినిమా కావ‌డంతో ఫ‌స్ట్ నుంచి ఈ సినిమా పై భారీ అంచ‌నాలు ఉన్నాయి. ట్రైల‌ర్ రిలీజ్ చేసిన‌ప్ప‌టి నుంచి ఈ సినిమా పై మ‌రిన్ని అంచ‌నాలు పెరిగాయి. మ‌హేష్ ఇందులో స్టూడెంట్ గా, కంపెనీ సి.ఈ.ఓగా, రైతుగా..ఇలా త్రి డిఫ‌రెంట్ షేడ్స్ లో క‌న‌పించారు. ఈ మూడు విభిన్న పాత్ర‌ల్లో వైవిధ్యం చూపించి.. ఆ పాత్ర‌ల‌కు త‌గ్గ‌ట్టుగా న‌టించి మెప్పించారు. మ‌హేష్ త‌ర్వాత చెప్పుకోవాల్సింది అల్ల‌రి న‌రేష్ గురించి. ప‌ల్లెటూరు నుంచి చ‌దువుకోవ‌డానికి సిటీ వ‌చ్చిన యువ‌కుడుగా..అలాగే సొంత ఊరు పై ప్రేమ‌తో పోరాటానికి దిగే పాత్ర‌లో చాలా బాగా న‌టించాడు. ర‌విని చూస్తుంటే…గ‌మ్యం సినిమాలో గాలి శీను పాత్ర గుర్తొస్తుంటుంది.

మ‌హేష్.. తండ్రి ప్ర‌కాష్ రాజ్ చ‌నిపోయార‌ని తెలిసి విదేశాల నుంచి ఇంటికి వ‌చ్చిన‌ప్పుడు తండ్రి రాసిన లెట‌ర్ ను త‌ల్లి జ‌య‌సుధ రిషికి ఇస్తుంది. ఈ లెట‌ర్ చ‌దువుతూ..ఎమోష‌న్ అయ్యే సీన్ లో మ‌హేష్ న‌ట‌న కంట‌త‌డి పెట్టిస్తుంది. ఈ సినిమా చూస్తుంటే…ఎంత వ‌ద్దు అనుకున్నా…శ్రీమంతుడు, క‌థానాయ‌కుడు, ర‌ఘ‌వ‌ర‌న్ బి.టెక్..త‌దిత‌ర చిత్రాలు గుర్తురాక‌మాన‌వు. జ‌గ‌ప‌తిబాబు, సాయికుమార్, త‌నికెళ్ల భ‌ర‌ణి, క‌మ‌ల్ కామ‌రాజు, వెన్నెల కిషోర్ పాత్ర‌ల‌కు త‌గ్గ‌ట్టుగా న‌టించారు. 

డైరెక్ట‌ర్ వంశీ స‌మాజంలో రైతు ఎలాంటి ప‌రిస్ధితుల్లో ఉన్నాడు. ప్ర‌భుత్వం కానీ..నేటి యువ‌త కానీ..రైతు బాగుండాలంటే ఏం చేయాలి అనేది ఈ సినిమా ద్వారా చెప్పారు. బ‌ల‌మైన క‌థ‌ను ఎంచుకున్నారు. సినిమా ప్రారంభం నుంచి చివ‌రి వ‌ర‌కు బోర్ అనేది లేకుండా ఇంట్ర‌స్ట్ గా చూసేలా బ‌ల‌మైన క‌థ‌నంతో క‌థ‌ను న‌డిపించ‌డంలో స‌క్స‌స్ అయ్యారు. అయితే…క్లైమాక్స్ కి వ‌చ్చేస‌రికి సినిమా ఇంకా అవ‌లేదు ఏంటి..?  లెంగ్త్ ఎక్కువ అయిన‌ట్టు ఉంది అనే ఫీలింగ్ ఆడియ‌న్ కి క‌లుగుతుంది.

దేవిశ్రీ మ్యూజిక్ బాగుంది. అశ్వ‌నీద‌త్, దిల్ రాజు, పీవీపీ ఈ ముగ్గురు నిర్మాత‌లు ఏమాత్రం రాజీప‌డ‌కుండా మంచి క్వాలిటీతో ఈ సినిమాని నిర్మించారు. ప్ర‌తి ఫ్రేమ్ లో ఆ క్వాలిటీ కనిపిస్తుంది. వంశీ త‌ను న‌మ్మిన క‌థ‌ను నిజాయితీగా చెప్పాడు. కొత్త క‌థ కాక‌పోయినా..మ‌హ‌ర్షి మంచి సినిమా..!

రేటింగ్ – 3/5

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here