Home Actor మ‌హ‌ర్షి ర‌న్ టైమ్ ఎంత‌..?

మ‌హ‌ర్షి ర‌న్ టైమ్ ఎంత‌..?

141
0

సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు – సూప‌ర్ హిట్ చిత్రాల దర్శ‌కుడు వంశీ పైడిప‌ల్లి కాంబినేష‌న్ లో రూపొందుతోన్న భారీ చిత్రం మ‌హ‌ర్షి. అల్ల‌రి న‌రేష్ కీల‌క పాత్ర పోషిస్తున్న ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ జ‌రుపుకుంటోంది. మే 1న ప్రీ రిలీజ్ ఈవెంట్ ను గ్రాండ్ గా నిర్వ‌హించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మే 9న ప్ర‌పంచ వ్యాప్తంగా ఈ సినిమాని రిలీజ్ చేయ‌నున్నారు.

ఇదిలా ఉంటే…ఈ సినిమా నిడివి 4 గంట‌ల వ‌ర‌కు వ‌చ్చిందిని…ఎడిటింగ్ చేసిన త‌ర్వాత మూడు గంట‌లలోపు తీసుకువ‌చ్చార‌ని స‌మాచారం. 2.50 నిమిషాల‌కు లాక్ చేసార‌ని…ఫైన‌ల్ వెర్ష‌న్ చూసిన త‌ర్వాత హీరో మ‌హేష్ బాబు, నిర్మాత దిల్ రాజు చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నార‌ని తెలిసింది. ఖ‌చ్చితంగా అంచ‌నాల‌కు త‌గ్గ‌ట్టుగా మ‌హ‌ర్షి ఘ‌న విజ‌యం సాధిస్తుంద‌ని టీమ్ న‌మ్మ‌కంగా ఉన్న‌ట్టు టాక్ వినిపిస్తోంది.

ఈ మూవీకి రాక్ స్టార్ దేవిశ్రీప్ర‌సాద్ సంగీతం అందించారు. ఇటీవ‌ల రిలీజ్ చేసిన మ‌హ‌ర్షి సాంగ్స్ కు మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. ఇక సినిమా పై అంచ‌నాల‌ను పెంచేలా ట్రైల‌ర్ రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో థియేట్రిక‌ల్ ట్రైల‌ర్ రిలీజ్ చేయ‌నున్నారు.  

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here