Home Actor మ‌హ‌ర్షి షూటింగ్ అప్ డేట్ ఏంటి..? అస‌లు ఎందుకు వాయిదా ప‌డింది..?

మ‌హ‌ర్షి షూటింగ్ అప్ డేట్ ఏంటి..? అస‌లు ఎందుకు వాయిదా ప‌డింది..?

83
0

సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు హీరోగా వంశీ పైడిప‌ల్లి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న క్రేజీ మూవీ మ‌హ‌ర్షి. అశ్వ‌నీద‌త్, దిల్ రాజు, పీవీపీ సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ సినిమాని ఏప్రిల్ 5న రిలీజ్ చేయాలి అనుకున్నారు. ఆత‌ర్వాత ఏప్రిల్ 25న రిలీజ్ అన్నారు. ఇప్పుడు మే 9న రిలీజ్ చేయ‌నున్న‌ట్టు చిత్ర నిర్మాత‌ల్లో ఒక‌రైన దిల్ రాజు అఫిషియ‌ల్ గా ఎనౌన్స్ చేసారు.

ఈ సంద‌ర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో దిల్ రాజు మాట్లాడుతూ…మ‌హ‌ర్షి మార్చి 17కి టాకీ పూర్త‌వుతుంది. రెండు సాంగ్స్, మాంటేజ‌స్ బ్యాలెన్స్ ఉంటాయి. అబుదాబిలో ప్లాన్ చేస్తున్నాం.  2 సాంగ్స్ సెట్ సాంగ్స్ ఇక్క‌డే ప్లాన్ చేస్తున్నాం. ఏప్రిల్ 12కి సాంగ్స్ తో స‌హా కంప్లీట్ అవుతుంది. ఈ సినిమాని ఉగాదికి రిలీజ్ చేయాలి అని ఓపెనింగ్ అప్పుడు ఏప్రిల్ 5 అని ఎనౌన్స్ చేసాం. అయితే..వీసాలు డిలే అవ్వ‌డం వ‌ల‌న యు.ఎస్ షెడ్యూల్ వ‌న్ మంత్ డిస్ట‌ర్బ్ అయ్యింది. అందువ‌ల‌న ఏప్రిల్ 25న రిలీజ్ చేద్దాం అని ప్లాన్ చేసాం.

వంశీ పైడిప‌ల్లి కెరీర్ లోనే బెస్ట్ స్ర్కిప్ట్ ఇది. దాదాపు 2 సంవ‌త్స‌రాలు క‌ష్ట‌ప‌డి త‌యారు చేసిన స్ర్కిప్ట్. సినిమా అద్భుతంగా వ‌చ్చింది. షూటింగ్ కంప్లీట్ చేస్తున్నాం కానీ..పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ మాత్రం కంగారుగా చేయ‌డం ఇష్టం లేదు. నిన్న హీరో గారితో వంశీ గారితో అంద‌రితో కూర్చొని మే 9న రిలీజ్ చేద్దాం అని నిర్ణ‌యం తీసుకోవ‌డం జ‌రిగింది. అద్భుతంగా వ‌చ్చిన సినిమాని ప్రేక్ష‌కుల‌కు అదే రేంజ్ లో చూపించాలి. క్వాలిటీలో కాంప్ర‌మైజ్ కాకుండా హై వాల్యూస్ తో తీసాం. అశ్వ‌నీద‌త్ గారు నిర్మించిన జ‌గ‌దేక‌వీరుడు అతిలోక సుంద‌రి, మ‌హాన‌టి సినిమాలు మే 9నే రిలీజ్ అయ్యాయి. అలాగే మా బ్యాన‌ర్ లో ఆర్య‌,ప‌రుగు, భ‌ద్ర అన్నీ మే నెల‌లో రిలీజ్ అయ్యాయి. ఎక్స‌ట్రార్డిన‌రీ ఫిలింకి ఇవ‌న్నీ ఎక్స్ ట్రార్డిన‌రీగా కుదిరాయి. మ‌హేష్ బాబు గారి కెరీర్ లో వ‌న్ ఆఫ్ ద‌ బెస్ట్ ఫిలింగా ఉంటుంది.

మా బ్యాన‌ర్ లో సంక్రాంతికి బ్లాక్ బ‌ష్ట‌ర్ వ‌చ్చింది. సమ్మ‌ర్ లో వ‌స్తున్న మ‌హ‌ర్షి కూడా బ్లాక్ బ‌ష్ట‌ర్ అవ్వ‌బోతుంది అనిపిస్తుంది. పార్ల‌మెంట్ ఎన్నిక‌లు కూడా మే ఫ‌స్ట్ వీక్ లో వ‌స్తున్నాయి. ఎల‌క్ష‌న్స్ అయిపోయిన త‌ర్వాత ఓట్లు వేసేసిన ప్రేక్ష‌కులు, ఎగ్జామ్స్ అయిపోయిన త‌ర్వాత స్టూడెంట్స్,  ఖాళీగా ఉన్న ఫ్యామిలీస్ అంద‌రూ… మే 9కి రెడీ కండి. పోకిరి, ఒక్క‌డు, శ్రీమంతుడు వీటిలో నావెల్ పాయింట్ తో పాటు డిఫ‌రెంట్ క్యారెక్ట‌రైజేష‌న్ ఉంది. అలాంటిదే మా మ‌హ‌ర్షి. ఆల్ ఆడియ‌న్స్ కి క‌నెక్ట్ అయి ధియేట‌ర్ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చేట‌ప్పుడు ఒక ఫీల్ తో వ‌స్తారు అని చెప్పారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here