Home Actor యంగ్ టైగ‌ర్ హ్యాపీ బ‌ర్త్ డే..!

యంగ్ టైగ‌ర్ హ్యాపీ బ‌ర్త్ డే..!

67
0

గుణ శేఖ‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన బాల రామాయ‌ణం సినిమాతో బాల న‌టుడుగా తార‌క్ సినీ ప్ర‌పంచంలోకి ప్రవేశించారు. ఆత‌ర్వాత ఉషా కిర‌ణ్ మూవీస్ నిర్మించిన నిన్ను చూడాల‌ని చిత్రంతో హీరోగా ప‌రిచయం అయ్యారు. తొలి చిత్రంతోనే న‌టుడుగా మంచి మార్కులు సంపాదించడంలో విజ‌యం సాధించాడు. ఆత‌ర్వాత అన‌తి కాలంలోనే ఆది, సింహాద్రి చిత్రాల‌తో సెన్సేష‌న్ క్రియేట్ చేసి చిన్న‌ వ‌య‌సులోనే స్టార్ ఇమేజ్ సంపాదించుకున్న హీరోగా ఓ రికార్డ్ క్రియేట్ చేసాడు.

ఆత‌ర్వాత న‌టించిన చిత్రాలు కొన్ని ఫ్లాప్ అయినా.. మ‌ళ్లీ య‌మ‌దొంగ సినిమాతో విజ‌యం సాధించారు. అదుర్స్, బృందావ‌నం, బాద్ షా, టెంప‌ర్, నాన్న‌కు ప్రేమ‌తో, జ‌న‌తా గ్యారేజ్, జై ల‌వ‌కుశ‌, అర‌వింద స‌మేత‌..ఇలా వైవిధ్య‌మైన చిత్రాల‌తో స‌క్స‌స్ సాధిస్తోన్న తార‌క్ ప్ర‌స్తుతం ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళితో ఆర్ఆర్ఆర్ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సంచ‌ల‌న చిత్రం వ‌చ్చే సంవ‌త్సంర జులైలో ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

ఈ రోజు ( మే 20) తారక్ పుట్టిన‌రోజు. అయితే…త‌న పుట్టిన రోజు వేడుకలకు ఎటువంటి హడావుడి చేయవద్దని అభిమానులకు జూనియర్‌ ఎన్టీఆర్‌ సూచించారు. నాన్న మమ్మల్ని విడిచి వెళ్లి ఏడాది కూడా పూర్తికాలేదు. ఇంకా ఆ విషాదం నుంచి మేము తేరుకోలేదు. ఈ పరిస్థితుల్లో ఎటువంటి వేడుకలు వద్దు అంటూ జూనియర్‌ అభిమానులను కోరారు. పలువురు సినీ ప్ర‌ముఖులు సోష‌ల్ మీడియా ద్వారా తారక్ కి జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు తెలియ‌చేస్తున్నారు.  

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here