Home Movie News యదార్ద సంఘటనల ఆధారంగా “పలాస 1978”

యదార్ద సంఘటనల ఆధారంగా “పలాస 1978”

87
0

తమ్మారెడ్డి భరద్వాజ సమర్పణలో ఓ చిత్రం తెరమీదకు రానుంది. “పలాస 1978” పేరు తో కరుణ కుమార్ దర్శకత్వంలో అప్పారావు బెల్లాన, అట్లూరి వరప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రఘు కుంచె సంగీతాన్ని, విన్సెంట్ అరుల్ సినిమాటోగ్రఫీ ని సమకూరుస్తున్నారు.

ఈ చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ.. యదార్ద సంఘటనల ఆధారంగా “పలాస 1978” చిత్రాన్ని తెరమీదకు తీసుకు వస్తున్నాం.  పలు చిత్రాలకు రచన దర్శకత్వ విభాగంలో వర్క్ చెసిన కరుణ కుమార్ ఈ సినిమా ద్వారా దర్శకుడిగా పరిచయమవుతున్నాడు.  ప్రముఖ హీరొ తో పాటు వర్దమాన కథానాయకుడు  ఈ చిత్రంలో నటించనున్నారు.

ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు జరుగుతున్నాయి. జనవరిలో చిత్రీకరణ ప్రారంభిస్తాము. ఇతర నటీనటులు, టెక్నిషియన్ల వివరాలను త్వరలోనే తెలియ చేస్తామన్నారు. ఈ చిత్రానికి కెమెరా: విన్సెంట్ అరుల్, సంగీతం: రఘ కుంచె.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here