Home Actor యాక్ష‌న్ సీన్స్ లో.. నాగ శౌర్య‌.

యాక్ష‌న్ సీన్స్ లో.. నాగ శౌర్య‌.

60
0
యాక్ష‌న్ సీన్స్ చిత్రీక‌ర‌ణ‌లో..నాగ శౌర్య‌. spiceandhra

యూత్ హీరో నాగ శౌర్య‌, బ‌బ్లీ బ్యూటీ మెహ‌రిన్ జంట‌గా ఐరా క్రియేష‌న్స్ ప‌తాకం పై శంక‌ర్ ప్ర‌సాద్ ముల్పూరి స‌మ‌ర్ప‌ణ‌లో ఉషా ముల్పూరి నిర్మాత‌లుగా ప్రొడ‌క్ష‌న్ నెం 3 రూపొందుతున్న సంగ‌తి తెలిసిందే. నూత‌న ద‌ర్శ‌కుడు ర‌మ‌ణ తేజ ఈ సినిమాతో తెలుగు తెరకు ప‌రిచ‌యం అవుతున్నారు. అటు క్లాస్ ఇటు మాస్ ఆడియెన్స్ ని అల‌రించాల‌నే ఉద్దేశంతో ఈ సినిమాలో కాస్త ఎక్క‌వుగానే యాక్ష‌న్ స‌న్నివేశాల్ని చిత్రీక‌రిస్తున్న‌ట్లుగా యూనిట్ స‌భ్యులు చెబుతున్నారు. ప్యాన్ ఇండియా హిట్ గా నిలిచిన కేజీఎఫ్ కి ఫైట్స్ కంపోజ్ చేసిన అన్బు అరివు మాస్ట‌ర్స్ తెలుగులో మొద‌టిసారిగా నాగ‌శౌర్య సినిమాకి యాక్ష‌న్ కొరియోగ్ర‌ఫి చేస్తుండ‌టం విశేషం.

ఈ నేప‌థ్యంలోనే ఇటీవ‌లే వైజాగ్ లో ఈ సినిమాకి సంబంధించిన ఓ యాక్ష‌న్ సీన్ ని షూట్ చేస్తుండ‌గా నాగ‌శౌర్య కాలికి గాయ‌మైన సంగ‌తి తెలిసిందే. అయితే పూర్తిగా గాయం నుంచి కోలుకోకుండానే నాగ‌శౌర్య మ‌ళ్లీ షూట్ లోకి జాయిన్ అవ్వ‌డం జ‌రిగింది. అన్బుఅరివు మాస్ట‌ర్స్ కి తెలుగులో ఇది మొద‌టి సినిమా కావ‌డంతో, యాక్ష‌న్ సన్నివేశాల్ని చాలా అద్భుతంగా కంపోజ్ చేస్తున్నార‌ని ద‌ర్శ‌కనిర్మాత‌లు చెబుతున్నారు. అలానే ఈ సినిమాలో క‌ట్ లేకుండా ఉండే 3 నిమిషాల నిడివి గ‌ల స‌న్నివేశాల్ని కూడా చిత్రీక‌రిస్తున్నామ‌ని,ఇవి ప్రేక్ష‌కుల‌కి ఓ స‌రికొత్త అనుభూతిని ఇస్తాయ‌ని యూనిట్ సభ్యులు తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here