Home Actor యాత్ర 2 గురించి ఇంట్ర‌స్టింగ్ న్యూస్..!

యాత్ర 2 గురించి ఇంట్ర‌స్టింగ్ న్యూస్..!

153
0

వై.ఎస్. రాజ‌శేఖ‌ర్ రెడ్డి పాద‌యాత్ర ఆధారంగా యాత్ర అనే సినిమాని తెర‌కెక్కించిన విష‌యం తెలిసిందే. ఈ చిత్రాన్ని మ‌హి వి రాఘ‌వ్ తెర‌కెక్కించారు. ఇందులో రాజ‌శేఖ‌ర్ రెడ్డి పాత్ర‌ను మ‌ల‌యాళ సూపర్ స్టార్ మ‌మ్ముట్టి పోషించారు. ఫిబ్ర‌వ‌రిలో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన యాత్ర అన్నివ‌ర్గాల ప్రేక్ష‌కుల ఆద‌ర‌ణ‌తో స‌క్స‌స్ సాధించింది. వై.ఎస్ జ‌గ‌న్ కూడా పాద‌యాత్ర చేయ‌డం..సీఎం అవ్వ‌డం..151 సీట్లు గెలుచుకోవ‌డంతో యాత్ర 2 సినిమా తీయ‌నున్న‌ట్టు ద‌ర్శ‌కుడు మ‌హి వి రాఘ‌వ్ తెలియ‌చేసారు.

 మ‌హి వి రాఘ‌వ్ త‌న‌ ట్విట్టర్ ఖాతా ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు. వైఎస్ఆర్ కథ రాజారెడ్డి, జగన్ లేకుండా అసంపూర్తేనని వ్యాఖ్యానించారు.  యాత్ర-2 కథలో వీరిద్దరివే ప్రముఖ పాత్రలని చెప్పారు. యాత్ర సినిమాను వైఎస్ జగన్ ను చూపిస్తూ ముగించడానికి కారణం కూడా ఇదేనని, ఆ చిత్రంలో తామెక్కడ సినిమాను ముగించామో, అక్కడి నుంచి కొత్త సినిమా ప్రారంభం అవుతుందని అన్నారు. వైఎస్సార్‌ యాత్ర ఆయన తండ్రి రాజా రెడ్డి సమాధి నుంచి మొదలైంది. జగన్‌ యాత్ర తన తండ్రి సమాధి నుంచి ప్రారంభమైంది అని చెప్పారు.

 వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి.. తన తండ్రి మరణం తట్టుకోలేక చనిపోయిన వారిని స్వయంగా వచ్చి కలుస్తానని ప్రజలకు ఇచ్చిన మాట, ఆ మాట నిలబెట్టుకునే ప్రయత్నంలో ఆయనకు ఎదురైన ఇబ్బందులు.. ఎన్ని కష్టాలు ఎదురైన మాట నిలబెట్టుకునేందుకు వైఎస్‌ జగన్‌ ముందడుగు వేయటం, 9 ఏళ్ల పోరాటం తరువాత సంచ‌ల‌న విజయం సాధించటం త‌దిత‌ర అంశాల‌తో యాత్ర 2 ఉంటుంద‌ని స‌మాచారం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here