Home Actor యు.ఎస్. ఎ లో బాక్సాఫీస్ ని షేక్ చేస్తోన్న బేబి.

యు.ఎస్. ఎ లో బాక్సాఫీస్ ని షేక్ చేస్తోన్న బేబి.

45
0
యు.ఎస్ ఎ లో బాక్సాఫీస్ ని షేక్ చేస్తోన్న బేబి. spiceandhra

స‌మంత లేటెస్ట్ సెన్సేష‌న్ ఓ.. బేబి. నందినీ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఈ విభిన్న క‌థా చిత్రం ఈ నెల 5న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. ఫ‌స్ట్ డే ఫ‌స్ట్ షో నుంచే హిట్ టాక్ సొంతం చేసుకుంది. ఆత‌ర్వాత హౌస్ ఫుల్ క‌లెక్ష‌న్స్ తో దూసుకెళుతూ బ్లాక్ బ‌ష్ట‌ర్ ను సొంతం చేసుకుంది. సీనియ‌ర్ న‌టి ల‌క్ష్మి, రావు ర‌మేష్‌, రాజేంద్ర ప్ర‌సాద్ ల న‌ట‌న ప్రేక్ష‌కుల‌ను విశేషంగా ఆక‌ట్టుకుంటుంది.

ఇక స‌మంత అయితే…అద‌ర‌గొట్టేసింది. పైకి 20 ఏళ్ల అమ్మాయిగా క‌నిపిస్తూ… 70 ఏళ్ల బామ్మ‌గా న‌టించడం అంటే ఓ ఛాలెంజ్. ఏ పాత్ర‌నైనా అద్భుతంగా పోషించ‌గ‌ల స‌మంత ఈ పాత్ర‌లో కూడా చాలా ఈజీగా న‌టించి అన్నివ‌ర్గాల ప్రేక్ష‌కుల ఆద‌ర‌ణ పొందింది. ఇలాంటి పాత్ర చేయాలంటే ఒక్క స‌మంత మాత్ర‌మే చేయ‌గ‌ల‌దు అనేలా న‌టించి మెప్పించింది.

బేబి తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఓవ‌ర్ సీస్ లో సైతం రికార్డు స్ధాయి క‌లెక్ష‌న్స్ వ‌సూలు చేస్తూ.. బాక్సాఫీస్ ని షేక్ చేస్తుంది. మూడు రోజుల‌కే హాఫ్ మిలియ‌న్ మార్క్ క్రాస్ చేసిన బేబి 1 మిలియ‌న్ దిశ‌గా స‌క్స‌స్ ఫుల్ గా ర‌న్ అవుతోంది. యు.ఎస్.ఎలో బేబికి ల‌భిస్తున్న ఆద‌ర‌ణ చూసి అక్క‌డ‌ మ‌రో 10 సెంట‌ర్స్ లో రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు. దీనిని బ‌ట్టి అర్ధం చేసుకోవ‌చ్చు యు.ఎస్.ఎ లో బేబికి రెస్పాన్స్ ఏ రేంజ్ లో ఉందో.  

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here