Home Actor యూఎస్ లో భారీ స్ధాయిలో రిలీజ్ అవుతోన్న మ‌జిలీ..!

యూఎస్ లో భారీ స్ధాయిలో రిలీజ్ అవుతోన్న మ‌జిలీ..!

111
0


అక్కినేని నాగ చైత‌న్య‌, స‌మంత జంట‌గా న‌టించిన తాజా చిత్రం మ‌జిలీ. నిన్ను కోరి ఫేమ్ శివ నిర్వాణ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఈ విభిన్న ప్రేమ క‌థా చిత్రం పై భారీ అంచ‌నాలు ఉన్నాయి. ఇటీవ‌ల రిలీజ్ చేసిన టీజ‌ర్ & సాంగ్స్ కు ట్రెమండ‌స్ రెస్పాన్స్ రావ‌డంతో..యూట్యూబ్ లో ట్రెండింగ్ లో నిలిచాయి. ఏప్రిల్ 5న ఈ సినిమాని రిలీజ్ చేయ‌నున్నారు. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా యూఎస్ లో కూడా భారీ స్ధాయిలో ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నారు.

యూఎస్ లో 150 లోకేష‌న్స్ లో మ‌జిలీ రిలీజ్ కానుంది. ఈ మూవీలో చైత‌న్యకి భార్యగా సమంత న‌టించ‌గా.. ప్రియురాలిగా దివ్యాంకా కౌశిక్ నటించారు.  గోపీ సుంద‌ర్ సంగీతం అందిస్తున్నారు. ఈ మూవీ ఎనౌన్స్ చేసిన‌ప్ప‌టి నుంచి పాజిటివ్ టాక్ ఉంది. అయితే… చైత‌న్య గ‌త చిత్రాలు శైల‌జారెడ్డి అల్లుడు, స‌వ్య‌సాచి ఫ్లాప్ అవ్వ‌డంతో ఈ సినిమా పై అభిమానులు చాలా ఆశ‌లు పెట్టుకున్నారు. అలాగే టీమ్ అంతా చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. మ‌రి…అంచ‌నాల‌కు త‌గ్గ‌ట్టుగా మ‌జిలీ అంద‌ర్నీ ఆక‌ట్టుకుని మంచి విజ‌యం సాధిస్తుంద‌ని ఆశిద్దాం..!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here