Home Actor యూట్యూబ్ లో సెన్సేష‌న్ క్రియేట్ చేస్తోన్న మ‌హేష్ మ‌హ‌ర్షి..!

యూట్యూబ్ లో సెన్సేష‌న్ క్రియేట్ చేస్తోన్న మ‌హేష్ మ‌హ‌ర్షి..!

62
0


సూపర్‌స్టార్‌ మహేష్‌ హీరోగా.. సూపర్ హిట్‌ చిత్రాల దర్శకుడు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందుతోన్న భారీ చిత్రం మ‌హ‌ర్షి. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌, వైజయంతి మూవీస్‌, పి.వి.పి సినిమా బ్యాన‌ర్స్ పై  హై టెక్నికల్‌ వేల్యూస్‌తో ఈ భారీ చిత్రం రూపొందుతోంది. ఇది మహేష్‌కు  25వ చిత్రం కావడం విశేషం. మహేష్‌ సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. అల్లరి నరేష్‌ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని మే 9న వరల్డ్‌వైడ్‌గా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. కాగా, ఈ చిత్రంలోని మొదటి పాటను ఈరోజు (మార్చి 29) విడుదల చేశారు.

‘ఛోటి ఛోటి చోటి ఛోటీ బాతే.. మీటి మీటి మీటి మీటీ యాదే.. ఓ పరిచయం ఎప్పుడూ చిన్నదే.. ఈ చెలిమికే కాలమే చాలదే…’ అంటూ శ్రీమణి రాసిన పాటను దేవిశ్రీ ప్రసాద్‌ స్వీయ సంగీత సారధ్యంలో గానం చేశారు. స్నేహంలోని మాధుర్యాన్ని ఎంతో అందమైన పదాలతో శ్రీమణి పాటగా మలిచిన తీరు బాగుంది. అంతే అందంగా, అంతే మధురంగా దేవిశ్రీప్రసాద్‌ ఈ పాటను అందరికీ కనెక్ట్‌ అయ్యేలా పాడారు. ఈ పాటకు శ్రోతల నుంచి ట్రెమండస్‌ రెస్పాన్స్‌ వస్తోంది. యూట్యూబ్ లో 1 మిలియ‌న్ వ్యూస్ క్రాస్ చేసి 2 మిలియ‌న్ దిశ‌గా వెళుతుంది. ఈ సినిమాకి సంబంధించి ప్రతి వారం ఒక పాట విడుదల చేయబోతున్నారు.

దేవిశ్రీప్రసాద్‌ సంగీతాన్ని అందిస్తున్న ఈ సూపర్‌ మూవీకి కె.యు.మోహనన్‌ సినిమాటోగ్రఫీ నిర్వహిస్తున్నారు. హరి, సాల్మన్‌, సునీల్‌బాబు, కె.ఎల్‌.ప్రవీణ్‌, రాజు సుందరం, శ్రీమణి, రామ్‌-లక్ష్మణ్‌ పనిచేస్తున్న ముఖ్య సాంకేతికవర్గం. దర్శకత్వం: వంశీ పైడిపల్లి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here