Home News Movie News యూత్ కి బాగా క‌నెక్ట్ అవుతోన్న‌ రామ్ మూవీ ట్రైల‌ర్..!

యూత్ కి బాగా క‌నెక్ట్ అవుతోన్న‌ రామ్ మూవీ ట్రైల‌ర్..!

10
0
DpH8cHvW0AAnZ3U

ఎన‌ర్జిటిక్ హీరో రామ్ – స‌క్స‌స్ ఫుల్ డైరెక్ట‌ర్ న‌క్కిన త్రినాధ‌రావు కాంబినేష‌న్ లో రూపొందుతోన్న చిత్రం హ‌లో గురు ప్రేమ కోస‌మే. శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్ పై దిల్ రాజు ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో రామ్ స‌ర‌స‌న అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ న‌టించింది. విల‌క్ష‌ణ న‌టుడు ప్ర‌కాష్ రాజ్ కీల‌క పాత్ర పోషించారు. ఈ రోజు ఈ మూవీ ట్రైల‌ర్ ను ట్విట్ట‌ర్ ద్వారా చిత్ర నిర్మాణ సంస్థ‌ రిలీజ్ చేసింది. ట్రైల‌ర్ విష‌యానికి వ‌స్తే..ఈ క‌మ‌ర్షియ‌ల్ ల‌వ్ స్టోరీకి వినోదాన్నిజోడించి ఈ క‌థ రాసార‌నే విష‌యం తెలుస్తుంది.

బెజ‌వాడ ప్ర‌స‌న్న‌కుమార్ రాసిన సంభాష‌ణ‌లు బాగున్నాయి. యూత్ కి బాగా క‌నెక్ట్ అయ్యేలా ఉన్నాయి. డైరెక్ట‌ర్ న‌క్కిన త్రినాధ‌రావు, రైట‌ర్ బెజ‌వాడ ప్ర‌స‌న్న‌కుమార్ క‌లిసి సినిమా చూపిస్త మావ‌, నేను లోక‌ల్ చిత్రాల‌తో చేసిన మ్యాజిక్ ని ఈ సినిమాతో మ‌రోసారి చేసార‌నిపిస్తోంది. దీనికి తోడు రాక్ స్టార్ దేవిశ్రీప్ర‌సాద్ సంగీతం, దిల్ రాజు నిర్మాణం, రామ్ అభిన‌యం, అనుప‌మ అందం…అంతా క‌లిసి విజ‌యాన్ని సొంతం చేసుకుంటార‌నిపిస్తోంది. ద‌స‌రా కానుక‌గా ఈ నెల 18న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేందుకు రెడీ అవుతోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here