Home Actor యూత్ ని బాగా ఆక‌ట్టుకుంటున్న జోడి టీజ‌ర్.

యూత్ ని బాగా ఆక‌ట్టుకుంటున్న జోడి టీజ‌ర్.

42
0
యూత్ ని బాగా ఆక‌ట్టుకుంటున్న జోడి టీజ‌ర్. spiceandhra

బుర్ర‌క‌థ సినిమాతో ఇటీవ‌ల ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన యువ హీరో ఆది సాయికుమార్ న‌టిస్తున్న తాజా చిత్రం జోడి. ఈ చిత్రంలో ఆది సాయికుమార్ – శ్రద్ధా శ్రీనాథ్ జంటగా న‌టిస్తున్నారు. యువ దర్శకుడు విశ్వనాథ్ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. విభిన్న ప్రేమ‌క‌థా చిత్రంగా రూపొందుతోన్న‌ ఈ సినిమా నుంచి తాజాగా ఒక టీజర్ ను రిలీజ్ చేసారు.

ఆది, శ్ర‌ద్ధా శ్రీనాధ్ పరిచయం .. ఆ పరిచయం ప్రేమగా మారడం .. ప్రేమికులుగా తమదైన ప్రపంచంలో విహరించడం ఈ టీజర్ లో చూపించారు. చాలా సింపుల్ గా..కూల్ గా ఉన్న ఈ టీజ‌ర్ యూత్ ని విశేషంగా ఆక‌ట్టుకుంటుంది. జెర్సీ సినిమాలో నాని స‌ర‌స‌న న‌టించిన శ్ర‌ద్ధా శ్రీనాథ్ ఈ సినిమాలో మ‌రింత గ్లామ‌ర‌స్ గా క‌నిపిస్తుంది. సాయి వెంకటేశ్ – పద్మజ సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ సినిమాకి, ఫణి కల్యాణ్ సంగీతాన్ని అందిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here