Home Actor రాక్షసుడు రివ్యూ

రాక్షసుడు రివ్యూ

257
0

బెల్లంకొండ సాయిశ్రీనివాస్, అనుప‌మ జంట‌గా న‌టించిన చిత్రం రాక్ష‌సుడు. ర‌మేష్‌వ‌ర్మ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. కోనేరు స‌త్య‌నారాయ‌ణ ఈ చిత్రాన్ని నిర్మించారు. త‌మిళ సినిమా రాచ్చ‌స‌న్ కి ఇది రీమేక్. ట్రైల‌ర్ కు మంచి రెస్పాన్స్ రావ‌డం.. త‌మిళంలో ఆల్రెడీ విజ‌యం సాధించి ఉండ‌డంతో ఈ సినిమా ఖ‌చ్చితంగా ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంటుంది అనే అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. ఈ రోజు (ఆగ‌ష్టు 2) రాక్ష‌సుడు చిత్రం రిలీజైంది. మ‌రి.. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కి విజ‌యాన్ని అందించిందా..? లేదా..? అనేది చెప్పాలంటే ముందుగా క‌థ చెప్పాల్సిందే.

క‌థ – అరుణ్ (బెల్లంకొండ సాయి శ్రీనివాస్) కి సినిమాలంటే ప్రాణం. త‌నకి డైరెక్ట‌ర్ అవ్వాల‌నేది ఓ క‌ల‌. త‌న క‌లను నిజం చేసుకోవ‌డం కోసం చాలా క‌ష్ట‌ప‌డ‌తాడు. ముఖ్యంగా ఓ థ్రిల్ల‌ర్ మూవీ తీయాల‌నుకుంటాడు. అందుకు అవ‌స‌ర‌మైన సంఘ‌ట‌న‌లు పేప‌ర్ లో ఎప్పుడు వ‌చ్చినా క‌ట్ చేసి దాచుకుంటాడు. అయితే… త‌ను ఎంత ప్ర‌య‌త్నించినా ద‌ర్శ‌కుడుగా సినిమా తీసేందుకు అవ‌కాశం రాదు. దీంతో ఇక చేసేది లేక త‌ల్లి కోరిక మేర‌కు స‌బ్ ఇన్ స్పెక్ట‌ర్ గా జాయిన్ అవుతాడు. అరుణ్ బావ (రాజీవ్ క‌న‌కాల‌) కూడా పోలీసే.

ఇదిలా ఉంటే… అరుణ్ జాబ్ లో జాయిన్ అయిన త‌ర్వాత స్కూల్ లో చ‌దువుకునే అమ్మాయిల హ‌త్య‌లు జ‌రుగుతుంటాయి. ఇవి వ‌రుస‌గా జ‌రుగుతుండ‌డంతో ఎవ‌రు చేస్తున్నారో తెలుసుకునే ప్ర‌య‌త్నంలో ఊహించ‌ని నిజాలు వెలుగులోకి వ‌స్తాయి. రోజురోజుకు ఈ స‌మ‌స్య మ‌రింత సీరియ‌స్ అవుతుంది. ఎవ‌రో సైకో ఇదంతా చేస్తున్నాడు అని అరుణ్ క‌నిపెడ‌తాడు. ఓ రోజు అరుణ్ మేన‌కోడ‌లు సిరి కూడా సైకోకి బ‌లైపోతుంది.

స్కూల్ టీచ‌ర్ కృష్ణ‌వేణి (అనుప‌మ‌). ఆమె ద్వారా అరుణ్ కి మ‌రిన్ని విష‌యాలు తెలుస్తాయి. అయితే… ఆ సైకో ఎందుకు ఇలా చేస్తున్నాడు..? అత‌ని స్టోరీ ఏంటి..? అరుణ్ సైకోని ఎలా ప‌ట్టుకున్నాడు.. ? చివ‌రికి ఏమైంది..? అనేదే క‌థ‌

విశ్లేష‌ణ – బెల్లంకొండ సాయి శ్రీనివాస్…సాంగ్స్, ఫైట్స్ కాకుండా..ఈసారి ఏదైనా డిఫ‌రెంట్ మూవీ చేయాల‌ని చేసిన ప్ర‌య‌త్నం ఈ రాక్ష‌సుడు. ఇందులో ఎక్క‌డా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ క‌నిపించ‌డు. అరుణ్ అనే పాత్రే క‌నిపిస్తుంది. పాత్ర‌కు త‌గ్గ‌ట్టుగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఇప్ప‌టి వ‌ర‌కు త‌ను న‌టించిన చిత్రాల్లో బెస్ట్ ప‌ర్ ఫార్మెన్స్ అనేలా న‌టించాడు. అనుప‌మ పాత్ర ప‌రిధి త‌క్కువే అయిన‌ప్ప‌టికీ.. చాలా చ‌క్క‌గా న‌టించింది. ప్ర‌స్తుతం స‌మాజంలో అమ్మాయిలకు ఎదుర‌వుతున్న సంఘ‌ట‌న‌ల‌ను ఇందులో చూపించారు.

స్కూల్ లో కొంత మంది ఉపాధ్యాయులు అమ్మాయిల ప‌ట్ల అస‌భ్యంగా ప్ర‌వ‌ర్తిస్తున్నార‌ని అప్పుడ‌ప్పుడు వార్త‌ల్లో చూస్తుంటాం. వీటిని ఇందులో క‌ళ్ళ‌కు క‌ట్టిన‌ట్టుగా చూపించారు. స‌న్నివేశాల‌కు త‌గ్గ‌ట్టుగా జిబ్రాన్ చ‌క్క‌ని సంగీతం అందించారు. ఈ క‌థ‌కి అవ‌స‌ర‌మైన వాటిని మాత్ర‌మే చూపించారు త‌ప్పా… ఎక్క‌డా అన‌వ‌స‌రంగా ఈ స‌న్నివేశం పెట్టారు అనేలా ఒక్క సీన్ కూడా లేదు. కూతురు క‌నిపించ‌డం లేదు అని తెలిసిన‌ప్పుడు తండ్రిగా రాజీవ్ క‌న‌కాల అద్భుతంగా న‌టించారు. ఓ తండ్రి వేద‌న ఎలా ఉంటుందో
చూపించారు.

ఫ‌స్టాఫ్ లో సీన్స్ సెకండాఫ్ ని ఇంట్ర‌స్టింగ్ గా చూసేలా ఉన్నాయి. ఇక సెకండాఫ్ స్టార్ట్ అయిన త‌ర్వాత ప్ర‌తి సీన్ ఉత్కంఠ‌గా ఉంటూ నెక్ట్స్ ఏం జ‌రుగుతుందో అని ఆస‌క్తితో చూసేలా ద‌ర్శ‌కుడు చాలా చ‌క్క‌గా తెర‌కెక్కించాడు. అయితే… కామెడీ అనేది లేదు. రెగ్యుల‌ర్ క‌మ‌ర్షియ‌ల్ సినిమాలు చూసే వారికి అంత‌గా ఆక‌ట్టుకోక‌పోవ‌చ్చు. అందుచేత రాక్ష‌సుడు థ్రిల్ల‌ర్ మూవీస్ ఇష్ట‌ప‌డే వారికి బాగా క‌నెక్ట్ అవుతుంది.

రేటింగ్ – 2.75/5

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here