Home News రాజకీయం అంటే కొన్ని కుటుంబాలకే పరిమితమా?

రాజకీయం అంటే కొన్ని కుటుంబాలకే పరిమితమా?

58
0

• నెల్లూరు జిల్లాలో కుటుంబ రాజకీయాలతో ప్రజలకు అండ దొరకలేదు

• ప్రజల వెంట ఉండేవారిని రాజకీయాల్లోకి తీసుకొస్తా… యువతకు బలమైన భవిష్యత్ ఇద్దాం

• నాకు పుచ్చలపల్లి సుందరయ్య గారు ప్రేరణ

• నా దగ్గర మంత్రదండం లేదు… మంచి చేయాలనే మనసు ఉంది

• పార్టీ కోసం పనిచేసే ప్రతి ఒక్కరికీ గుర్తింపు ఉంటుంది

• నెల్లూరు జనసైనికుల సమావేశంలో జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కల్యాణ్ కుటుంబ రాజ‌కీయాల‌ను ప‌క్క‌న పెట్టి ప్రజల వెంట ఉండే వ్య‌క్తుల‌ను రాజ‌కీయాల్లోకి తీసుకొస్తానని జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కల్యాణ్ గారు స్పష్టం చేశారు. రాజకీయాలు అనేవి కొన్ని కుటుంబాలకు పరిమితం చేసేస్తున్నారు… నెల్లూరు జిల్లాలో ఈ కుటుంబ రాజకీయాలతో ప్రజలకు అండ దొరకలేదన్నారు. . నెల్లూరు జిల్లాలో  నేదురుమ‌ల్లి, మాగంటి, ఆనం కుటుంబాల‌ను చూశాను… వీరెవ‌రూ యువ‌త‌రానికి ప్రతినిధులుగా నిల‌బ‌డ‌లేక‌పోయారని చెప్పారు.  నాయ‌కులు 2019 సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌ను దృష్టిలో పెట్టుకుని పార్టీలోకి రావద్దు… 25 ఏళ్ల పోరాటానికి సిద్ధ‌మై రండి. యువ‌త‌కు బ‌ల‌మైన భ‌విష్య‌త్తును నిర్మిద్దామని పిలుపునిచ్చారు. సోమవారం ఉదయం నెల్లూరు నగరంలో నెల్లూరు జిల్లా జనసైనికులతో సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా శ్రీ పవన్ కల్యాణ్  మాట్లాడుతూ.. “జ‌న‌సేన మూల సిద్ధాంతాల్లో మొద‌టిదైన కులాల‌ను క‌లిపే ఆలోచ‌న‌ విధానం.. నెల్లూరు జిల్లాలోని కులాల ఐక‌త్య‌ను చూసే పుట్టింది. పుచ్చ‌ల‌ప‌ల్లి సుంద‌ర‌య్య గారి ఆలోచ‌న విధానాన్ని స్ఫూర్తిగా తీసుకొని రాజ‌కీయాల్లోకి వ‌చ్చాను. ఆయ‌న అస‌లు పేరు పుచ్చ‌ల‌ప‌ల్లి సుంద‌ర‌రామిరెడ్డి.. అయితే ప్ర‌జ‌లంద‌రూ త‌న వాళ్లుగా భావించి పేరు వెనుక ఉన్న కులం పేరును తీసే సుకున్నారాయన. రాజ‌కీయ నాయ‌కుడు అంటే అన్ని కులాలు, అన్ని మ‌తాల‌ను, అన్ని ప్రాంతాల‌ను స‌మానంగా చూడాలి. నెల్లూరు రాజ‌కీయ చైత‌న్యం క‌లిగిన జిల్లా.  అమెరికా వెళ్లి స్పీచ్ ఇవ్వాలంటే భ‌యం లేదు కానీ, నెల్లూరు వ‌చ్చి మాట్లాడాలంటే భ‌యం. దీనికి కార‌ణం నెల్లూరులో పెర‌గ‌డ‌మే. బ‌యట నేను ప‌వ‌ర్ స్టారో, జ‌న‌సేనానో కావ‌చ్చు కానీ నెల్లూరు వ‌ర‌కు నేను కేవ‌లం క‌ళ్యాణ్ మాత్ర‌మే. నెల్లూరు రాజ‌కీయాలు కొన్ని కుటుంబాల మ‌ధ్య  ఉండిపోయాయి. ఇది మారాలంటే  కొత్త త‌రం, కొత్త ర‌క్తం రాజ‌కీయాల్లోకి రావాలి. లేక‌పోతే పాల‌న‌లో నిర్ల‌క్ష్య ధోర‌ణి ఆవ‌హిస్తుంది అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here