Home Actor రాజమండ్రిలో జనసేన ఆవిర్భావ సభకు భారీ ఏర్పాట్లు..!

రాజమండ్రిలో జనసేన ఆవిర్భావ సభకు భారీ ఏర్పాట్లు..!

85
0


మార్చి 14 మరపురాని రోజు..జనసేన ఆవిర్భవించిన రోజు. 2014 లో జనసేన ఊపిరిపోసుకున్న రోజు నుంచి ఈ అయిదేళ్ల పాటు నిత్యం మీరు ఆశీర్వదిస్తూనే ఉన్నారు. వెన్ను దన్నుగా నిలుస్తూనే ఉన్నారు. చిరు ప్రాయంలోనే జనసేన సాధించిన విజయాలు గర్వకారణం. 14 వ తేది మరికొద్ది రోజులలోనే మనముందుకు వస్తోంది. ఈసారి జనసేన ఆవర్భావ సభకు గోదావరి గట్టున ఉన్న చారిత్రాత్మక నగరం రాజమండ్రి  వేదిక కానుంది. జనసైనికులు, శ్రేయోభిలాషుల కోరిక మేరకు ఈసారి సభను ఇక్కడ జరపాలని నిర్ణయించారు.

ఆరోజు మధ్యాహ్నం మూడు గంటలకు రాజమండ్రి ఆర్ట్స్ కళాశాల ఆవరణలో స‌భ నిర్వ‌హించ‌నున్నారు. విశాలమైన ప్రాంగణంలో సభకు కావలసిన ఏర్పాట్లలో జనసేన ప్రతినిధులు తలమునకలై ఉన్నారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఈ రాజమండ్రి సభ ఒక తొలి అడుగు మాత్రమే…విశాఖ, విజయవాడ వంటి ఎన్నో నగరాలలో జనసేన మలి అడుగులు ఉంటాయ‌ని… ప్రతి ఒక్కరు ఉత్సాహంగా సభలో పాల్గొని ఆనందంగా ఇంటికి వెళ్లే విధంగా ఏర్పాట్లు చేస్తున్న‌ట్లు జనసేన ప్రతినిధులు తెలియ‌చేసారు.

రాజమండ్రి సభ ఏర్పాట్లను పర్యవేక్షించడానికి 15మంది సభ్యులతో ఒక కమిటీని ఏర్పాటు చేసారు. ఈ కమిటీ శ్రీ బొమ్మదేవర శ్రీధర్ (బన్ను ) ఆధ్వర్యంలో పనిచేస్తుంది.

కమిటీ సభ్యుల వివరాలు:

1. శ్రీ ఆకుల సత్యనారాయణ (రాజమండ్రి)

2. శ్రీ దుర్గేష్ (రాజమండ్రి)

3. శ్రీ బన్ని వాసు

4. శ్రీ పసుపులేటి సుధాకర్ (కావలి)

5. శ్రీమతి రాధమ్మ (అమలాపురం)

6. శ్రీమతి సరోజిని (Ex. మేయర్, కాకినాడ)

7. శ్రీమతి యామిని జ్యోత్స్న

8. శ్రీ పేసంగి ఆదినారాయణ (కాకినాడ)

9. శ్రీ పంతం నానాజీ (కాకినాడ)

10. శ్రీ నవుడు వెంకటరమణ (ఉంగుటూరు)

11. శ్రీ యర్రంకి సూర్యరావు (భీమవరం)

12. శ్రీ జి. శ్రీను బాబు (శ్రీకాకుళం)

13. శ్రీ రాపాక వరప్రసాద్ (రాజోలు)

14 శ్రీ కమలుద్ధీన్ (గుంటూరు)

15. శ్రీ దొమ్మేటి వెంటేశ్వరరావు (Ex. ఎమ్మెల్యే, కొత్తపేట)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here