Home Actor రాజు గారి గ‌ది 3 నుంచి త‌మ‌న్నా త‌ప్పుకుందా..? అస‌లు ఏమైంది..?

రాజు గారి గ‌ది 3 నుంచి త‌మ‌న్నా త‌ప్పుకుందా..? అస‌లు ఏమైంది..?

43
0
రాజు గారి గ‌ది 3 నుంచి త‌మ‌న్నా త‌ప్పుకుందా..? అస‌లు ఏమైంది..? spiceandhra

ఓంకార్ తెర‌కెక్కించిన రాజు గారి గ‌ది సినిమా విజ‌యం సాధించ‌డం..ఆత‌ర్వాత నాగార్జున‌, స‌మంత ప్ర‌ధాన తారాగ‌ణంగా రాజు గారి గ‌ది 2 కూడా తీయ‌డం తెలిసిందే. ఇప్పుడు రాజు గారి గ‌ది 3 సినిమాను ఓంకార్ ఇటీవ‌ల ప్రారంభించారు. మిల్కీబ్యూటీ త‌మ‌న్నా ఈ సినిమాలో ప్ర‌ధాన పాత్ర పోషించ‌నుంద‌ని ఎనౌన్స్ చేసారు.ఈ మూవీ ప్రారంభోత్స‌వంలో కూడా త‌మ‌న్నా పాల్గొంది.

అయితే.. ఏమైందో ఏమో కానీ..త‌మ‌న్నా ఈ సినిమా నుంచి త‌ప్పుకుంది అని వార్త‌లు వ‌స్తున్నాయి. కార‌ణం ఏంటంటే…త‌న‌కి చెప్ప‌కుండా క‌థ‌లో..త‌న పాత్ర‌లో మార్పులు చేసార‌ని..దీంతో బాగా ఫీలై ఈ ప్రాజెక్ట్ నుంచి త‌ప్పుకోవాల‌ని త‌మ‌న్నా నిర్ణ‌యం తీసుకుంద‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. మ‌రో వైపు  హిందీ సినిమాలో ఛాన్స్ రావడం వలన తప్పుకుందని మ‌రో వార్త షికారు చేస్తోంది.

ఈ నేప‌ధ్యంలో తాప్సీతో ఓంకార్ సంప్ర‌దింపులు జ‌రుపుతున్నార‌ని..ఆమె ఓకే అంటే త్వ‌ర‌లోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళుతుంద‌ని ఫిల్మ్ న‌గ‌ర్ లో టాక్ వినిపిస్తోంది. మ‌రి..ప్ర‌చారంలో ఉన్న ఈ వార్త‌లు నిజ‌మేనా..?  నిజ‌మే అయితే తాప్సీ ఓకే అంటుందో లేదో చూడాలి. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here