Home Actor రాజు గారి గ‌ది 3 లో ఎవ‌రు..?

రాజు గారి గ‌ది 3 లో ఎవ‌రు..?

67
0


యాంక‌ర్ ట‌ర్న‌డ్ డైరెక్ట‌ర్ ఓంకార్ రాజు గారి గ‌ది సినిమాతో విజ‌యం సాధించారు. ఈ సినిమా ఇచ్చిన విజ‌యంతో రాజు గారి గ‌ది 2 సినిమా తీసారు. ఇందులో నాగార్జున‌, స‌మంత న‌టించారు. వైవిధ్య‌మైన క‌థాంశంతో రూపొందిన ఈ సినిమా ఆశించిన స్ధాయిలో కాక‌పోయినా.. ఫ‌ర‌వాలేద‌నిపించింది.ఇప్పుడు ఓంకార్ రాజు గారి గ‌ది 3 ప్లాన్ చేస్తున్నారని వార్త‌లు వ‌స్తున్నాయి. గ‌తంలో రాజు గారి గ‌ది 2 మూవీ ప్ర‌మోష‌న్స్ టైమ్ లోనే ఓంకార్ రాజు గారి గ‌ది 3 తీస్తాన‌ని ప్ర‌క‌టించారు.

అలాగే నాగార్జున కూడా రాజు గారి గ‌ది 3 ఆలోచ‌న ఉంద‌ని చెప్పారు. ఇప్పుడు వ‌స్తున్న వార్త‌లు చూస్తుంటే ..ఇది నిజ‌మే అనిపిస్తుంది. అయితే..నాగార్జున ప్ర‌స్తుతం మ‌న్మ‌ధుడు 2 సినిమా చేస్తున్నారు. ఈ మూవీ ఈ నెల 25 నుంచి సెట్స్ పైకి వెళ్లేందుకు రెడీ అవుతోంది. ఈ మూవీ త‌ర్వాత జూన్ నుంచి బంగార్రాజు చిత్రాన్ని ప్రారంభించ‌నున్నారు. మ‌రి..ఈ రెండు సినిమాల త‌ర్వాత రాజు గారి గ‌ది 3 లో న‌టిస్తారా..?  లేక వేరే హీరో ఇందులో న‌టిస్తారా అనేది తెలియాల్సివుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here